2600 ROOMS TO BE MADE AVAILABLE FOR DEVOTEES IN TIRUPATI_ డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

Tirumala, Feb.2, 2018: After his monthly interactive program of Dial Your EO with the devotees through over on tele conferencing, the TTD Executive Officer Sri Anil Kumar Singhal showcased the TTDs drive to service the devotees coming in large numbers to Tirumala.

Highlights of the interaction with media at the Annamayya Bhavan, Tirumala this morning later on are as below:
• Successful conduction of Ratha Sapthami festival providing darshan to large number of devotes by providing annaprasadams, snacks, drinking water, butter milk etc., and thanked the TTD employees, Vigilance, Police and Srivari Se akulu for their service.
• Appealed to devotees Brahmotsavams in local TTD sub temples: Brahmotsavam at Srinivasa Mangapuram Sri KVS Temple from Feb 6-14. From Feb 6-15 at Sri Kapileswara Swamy Temple, Maha Sivarathri on Feb 13.
• TTD issuing special tokens for aged, challenged, mothers with 5 years kids for darshan two days in a month. On Feb 13 and 20 for aged and challenged 4000 tokens and Feb 12 and 21 for parents with 5 year old kinds.
• 588 complaints received on the innovative FMS call center (launched from Nov 23) for accommodation and room allotments in Tirumala. Call center operated 24×7 on January 24 for Ratha sapthami.
• Online booking of Kalyana mandapam commenced from January 24 on an experimental basis for 39 Kalyana mandapams of Chittoor district.
• VQC inside corridor pillars removed to regulate crowd management and avoid stampedes.
• SSD system of queues for sarva darshan facilitating smooth darshans.
• 45 tones of foreign currency of which 18 tons belonged to Malaysia, which will be exchanged with banks in 15 days.
• Talking to RBI for exchange of 25 paisa coins in Hundi.
• Promoting social forestry with perfumed flower plants all along Alipiri footpath, TTD roads, junctions etc. by April end.
• 2600 rooms to be made available for devotees in Tirupati with more Rest houses.
The TTD also inspected the model counters set up for the SSD time slot token issue and directed officials to prepare two models of such counters and make them more people friendly with sign boards and orderly queue lines.

Among others CVSO Sri Ake Ravi Krishna, TTD Chief Engineer Sri Chandrasekhar Reddy, SE Sri Ramachandra Reddy and other Engineering dept officials participated in the inspection.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

ఫిబ్రవరి 02, తిరుమల 2018: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు.

రథసప్తమి : జనవరి 24న రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించాం. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సంతృప్తికరంగా శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను దర్శించుకున్నారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, అల్పాహారం, తాగునీరు, మజ్జిగ అందించాం. ఈ సందర్భంగా భక్తులకు సేవలందించిన టిటిడి ఉద్యోగులకు, విజిలెన్స్‌ సిబ్బందికి, పోలీసులకు, శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు.

స్థానికాలయాల బ్రహ్మూెత్సవాలు : ఫిబ్రవరి 6 నుంచి 14వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, ఫిబ్రవరి 13న మహాశివరాత్రి పర్వదినం జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను.

ప్రత్యేక దర్శనాలు : వృద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రతినెలా 2 రోజుల పాటు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా ఫిబ్రవరి 13, 20వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు ఉదయం 10 గంటలకు 1000, మధ్యాహ్నం 2 గంటలకు 2000, మధ్యాహ్నం 3 గంటలకు 1000 మందికి కలిపి మొత్తం 4 వేల మందికి దర్శనం కల్పిస్తాం.

– ఫిబ్రవరి 14, 21వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ప్రవేశమార్గం ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తాం.

– ఈ అవకాశాన్ని వృద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.

ఎఫ్‌ఎంఎస్‌ కాల్‌సెంటర్‌ : తిరుమలలో గదులు పొందిన భక్తులకు ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ఎఫ్‌ఎంఎస్‌ కాల్‌సెంటర్‌ను గతేడాది నవంబరు 23వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పటివరకు 588 ఫిర్యాదులు అందాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాం.

– భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రథసప్తమి పర్వదినమైన జనవరి 24వ తేదీ నుండి రోజుకు 24గంటల పాటు ఎఫ్‌ఎంఎస్‌ కాల్‌సెంటర్‌ పనిచేసేలా చర్యలు తీసుకున్నాం.

కల్యాణమండపాల ఆన్‌లైన్‌ బుకింగ్‌ : జనవరి 24వ తేదీ నుంచి కల్యాణమండపాల ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ప్రారంభించాం. తొలిదశలో ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలోని 39 కల్యాణమండపాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. పోస్టాఫీసుల్లోనూ వీటిని బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాం.

క్యూలైన్ల క్రమబద్దీకరణ : వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 ఇన్‌సైడ్‌ కారిడార్‌లో ఉన్న పిల్లర్స్‌ వద్ద తోపులాటలు జరుగుతున్నట్టు భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఇక్కడ క్యూలైన్లను క్రమబద్దీకరించి తోపులాటలను నివారించాం.

– వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో కారిడార్‌ లోనికి భక్తులను ఒకేసారి వదలడం వల్ల ఎక్కువసేపు వేచి ఉండేవారు. ప్రస్తుతం అలా జరగకుండా సమయానుసారం భక్తులను క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నాం. తద్వారా భక్తులు సులభంగా ఆలయంలోకి వెళుతున్నారు.

ఈవో మాట్లాడుతూ టిటిడి వద్ద మొత్తం 45 టన్నుల విదేశీ నాణేలు ఉన్నాయని, ఇందులో 18 టన్నులు మలేసియాకు చెందినవని తెలిపారు. బ్యాంకులతో చర్చించి మలేసియా నాణేలను 15 రోజుల్లోపు మార్పిడి చేస్తామన్నారు. అదేవిధంగా భారతీయ కరెన్సీ 25 పైసల నాణేలు కూడా ఉన్నాయని, రిజర్వు బ్యాంకు అనుమతి తీసుకుని వీటిని కూడా మార్పు చేస్తామని తెలిపారు. తిరుమల ఘాట్‌ రోడ్లకు ఇరువైపులా, అలిపిరి నడక మార్గం, టిటిడి రోడ్లు, కూడళ్ల వద్ద సువాసనలు వెదజల్లే పుష్పాలతోపాటు రంగురంగుల పూల మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేపట్టామని, ఏప్రిల్‌ నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు. భక్తుల కోరిక మేరకు తిరుపతిలో దాదాపు 2600 గదులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దశలవారీగా విశ్రాంతి భవనాలు నిర్మిస్తామన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.