SRI GT REOPENS DARSHAN FOR DARSHAN AFTER MAHA SAMPROKSHANAM_ శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

Tirupati, 12 April 2018: The darshan of Lord Sri Govinda Raja Swamy to Pilgrim devotees recommenced on Thursday morning after Maha Samprokshana ritual by religious staff during wee hours.

TTD EO Sri Anil Kumar Singhal who took part in this ritual, later speaking on this occasion in the temple said that the Maha Samprokshanam for the temple was performed 12 years ago and Dhwaja Sthambha Sthapanam about 70 years back.

As a prelude to Maha Samprokshanam, Ritvik Varnam and other rituals were performed by a team of vedic scholars from April 7. Today Maha Samprokshanam was performed even to Bhashyakarulavaru, Garudalwar, Dwara palakas, Anjaneya Swamy as per agama. The Purnahuti was performed today at 2.30 followed by Maha Samprokshanam between 5am and 6.30am. The devotees will be allowed for darshan of Mula Virat from 8am onwards from today onwards”, he added.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD Agama advisor Sri NK Sundara Varadan, Temple Chief Priest Sri Srinivasa Deekshitulu, DyEO Smt Varalakshmi, AEO Sri Uday Bhaskar Reddy, Srivari Temple OSD Sri Pala Seshadri and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం ఉదయంతో శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా తెల్లవారుజామున 12.30 గంటలకు యాగశాలలో స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున 2.30 గంటలకు రుత్వికులు సంకల్ప పూజ నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ మహాపూర్ణాహుతి, మంగళ హారతి జరిగింది. ఉదయం 4.00 నుండి 4.30 గంటల మధ్య యాగశాల నుండి కుంభాలు, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా ఆలయాలలో యధాస్థానానికి వేంచేపు చేశారు.

ఉదయం 4.30 నుండి 6.30 గంటల వరకు మీనలగ్నంలో శ్రీగోవిందరాజస్వామివారి గర్భాలయ శిఖరంపై యాగశాల నుండి తీసుకువచ్చిన కలశాలలోని పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేశారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి మూలమూర్తికి కలశంలోని జలాలతో సంప్రోక్షణ చేసి, ధూపదీప నైవేధ్యాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం, సన్నిధిలోని ద్వారపాలకులు, గరుడాళ్వారు, ధ్వజస్తంభం, ఎదురు ఆంజనేయస్వామివారు, భాష్యకార్లు, కురత్తాళ్వార్‌, మధురకవి ఆళ్వార్‌, మొదలియాండన్‌ ఆలయాల మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం ఉదయం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాసంప్రోక్షణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, గతంలో 2004వ సంవత్సరం మే నెలలో ఈ కార్యక్రమం టిటిడి ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇదివరకు ఉన్న ధ్వజస్తంభం దాదాపు 70 సంవత్సరాల క్రితం శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రతిష్టించారని, బాలాలయంలో భాగంగా నూతన ధ్వజస్తంభ స్థాపన చేశామన్నారు.

ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో ఏప్రిల్‌ 8 నుండి 11వ తేదీ వరకు హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించి, ఏప్రిల్‌ 12వ తేదీ మహాసంప్రోక్షణ నిర్వహించినట్లు వివరించారు. ఉదయం 8.00 గంటల నుండి భక్తులకు శ్రీగోవిందరాజస్వామివారి మూలమూర్తి దర్శనం కల్పించామన్నారు.

అనంతరం టిటిడి ఈవో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారి మూలమూర్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో, తిరుమల జెఈవోకు ఆలయ అర్చకులు శేషవస్త్రాం బహూకరించారు.

అనంతరం ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ భాష్యకార్లువారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు శ్రీ భాష్యకార్లువారికి పెద్ద వీధి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

కాగా సాయంత్రం 5.30 నుండి 7.00 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు పెద్ద శేషవాహనంపై, భాష్యకార్లు, ఆళ్వార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, శ్రీవారి ఆలయం ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ ప్రధాన అర్చకులు మరియు కంకణభట్టార్‌ శ్రీ ఎ.పి. శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహదారులు శ్రీ ఎన్‌.ఎ.కె.సుందరవరదన్‌, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి, సూపరెంటెండెంట్‌ శ్రీ సురేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.