BHASHYAKARULA UTSAVAM COMMENCES IN TIRUMALA_ తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం

Tirumala, 12 April 2018: The 19-day religious fete, Bhasyakarula Utsavam commenced in Tirumala with spiritual fervour on Thursday.

Saint Ramanujacharya was the architect of many rituals, kainkaryams and procedures that are being followed in Srivari temple even today as per Vaikhanasa Agama.

He pioneered the establishment of Jiyar mutt, consecration of various idols in sub-temples inside Tirumala temple, Naivedyam offerings, recitation of Alwar Divya Prabandha Pasura Parayanam, construction of four-mada streets surrounding the temple, Purnakumbha Swagatham, appointment of Acharyapurushas to take of care of Kainkaryams etc.

The Acharyapurusha has given his commentary to Sri Bhashyam, a sanskrit mimamsa text and became famous by name Sri Bhashyakarula Varu. Every year on the advent of Arudra Nakshatra, which happens to be the birth star of Sri Ramanujacharya, Bhashyakarula Sattumora is observed in Tirumala temple. This year the Jayanthi falls on April 21.

On the first day on Thursday, after the first bell, Sri Ramanujacharya was taken on a celestial procession in four-mada streets on Bangaru Tiruchi.

Tirumala Sri Chinna Jiyar Swamy, Parupattedar Sri Ramachandra, Bokkasam In-Charge Sri Guru Raja were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం

ఏప్రిల్‌ 12, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు 19 రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 21వ తేదీన శ్రీ భాష్యకార్ల సాత్తుమొర జరుగనుంది. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.