NO COTTAGE ALLOTMENT EVEN TO SELF DONORS FROM OCT 2-4 DURING BRAHMOTSAVAMS_ శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు గదుల కేటాయింపు

Tirumala, 22 Aug. 19: The allotment of cottages would be made for donors during the ensuing annual Brahmotsavams only if they personally come for the festival which commences on September 30 and concludes on October 8 this year.

There will be no cottage allotment even for self donors from October 2 till October 4 in view of Garuda vahanam on October 4.

The donors could book their cottages online through the TTD website www.cdms.ttdsevaonline.com. The donors were also informed by the TTD that allotment of rooms and the number of days would depend on the quantum of their donations.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు గదుల కేటాయింపు

తిరుమల, 2019 ఆగ‌స్టు 22: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుంది. తిరుమలలో సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వ‌ర‌కు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దాతలు cdms.ttdsevaonline.com వెబ్‌సైట్‌ ద్వారా గదులను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబ‌రు 4న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబ‌రు 2 నుండి 4వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు.

ఒకే కాటేజిలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళంగా ఇచ్చిన దాతలకు రెండు గదులను రెండు రోజుల పాటు కేటాయిస్తారు. ఒకే కాటేజిలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలకు ఒక గదిని రెండు రోజులపాటు కేటాయించడం జరుగుతుంది. ఈ విషయాన్ని కాటేజి దాతలు గమనించాలని టిటిడి కోరుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.