INTERVIEWS FOR FIVE OUTSOURCING TTD JOBS ON NOV 23 _ నవంబరు 23న 5 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
Tirupati, 17 Nov. 19: TTD is conducting interviews for 10 posts of archakas, Melam workers etc. in outsourcing basis on November 23rd at 10 am in the SVETA complex.
The posts are at Srivari temple in Kurukshetra, Haryana and at Jubilee Hills, Hyderabad in Telangana
They include
Kurukshetra – Archakas-1, Veda Paratra), Paricharaka-1, Adhyapakam-1, Nadaswaram-1, Sruti-1, adaswaram-1 vacancies.
The other vacancies were for Archakas-2 (Vaikhanasa) at Srivari Hills Srivari temple and two Potu workers at Himayatnagar Srivari Temple in Hyderabad city.
Interested and qualified candidates should attend the interview with original certificates, two sets of Xerox copies of certificates and three passport photographs.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
నవంబరు 23న 10 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
తిరుపతి, నవంబరు 17, 2019: కురుక్షేత్ర మరియు హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో సేవలందించేందుకు గాను అర్చక సిబ్బంది, మేళం సిబ్బంది కలిపి 10 ఔట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను నవంబరు 23వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుపతిలోని శ్వేత భవనంలో ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.
కురుక్షేత్రలోని శ్రీవారి ఆలయంలో అర్చక 1 (పాంచరాత్ర), పరిచారక 1, వేదపారాయణం 1, అధ్యాపక 1, నాదస్వరం 1, శృతి 1 పోస్టులున్నాయి.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల శ్రీవారి ఆలయంలో అర్చక 2 (వైఖానస), హిమాయత్ నగర్ లోని శ్రీవారి ఆలయంలో పోటు వర్కర్లు 2 పోస్టులున్నాయి.
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణపత్రాలు, రెండు సెట్ల జెరాక్స్ కాపీలు, 3 పాస్పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాల్సి ఉంటుంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.