A DOZEN RELIGIOUS BOOKS RELEASED IN FRONT OF SARVABHOOPALA _ స‌ర్వ‌భూపాల‌ వాహ‌న‌సేవ‌లో మత్స్యపురాణం రెండో భాగం, 11 ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ

Tirumala, 19 Feb. 21: On the auspicious occasion of Radhasapthami, TTD has released 12 religious books in front of Sarvabhoopala Vahana Seva on Friday evening.

The publications included Telugu version of Narayanamantram by Dr.G Gunasekhar, Sri Devi Bhagavatam by Sri Subrahmanyam Giridhar Pillai, Nityarchana (Pancharatra Agama Shastra Grandham) and  Prayaschittakanda (Pancharatra Agama) by Dr R Venkata Venugopalacharyulu, a book on Ayurvedic herbs by Sri C Harinath and Dr D Narapa Reddy, Bharatiya Pavitra Punyakshetrams by Dr Sesham Ramanujacharyulu, Dharmavyadopakhyanam and Nalopakhyanamby Dr N Ramakrishnamacharyulu, Yayati Charitra by Dr D Venkatavadhani, Tirupati Venkateswara (Hindi) by Dr V Venkataramana Rao and Dr Gopal Sharma, Matrusri Tarigonda Vengamamba and her Ramaparinayam (Hindi) by Dr I N Chandrasekhar Reddy. Apart from these eleven publications, TTD has also released the Second part of Matsya Puranam.

Speaking on the occasion, TTD Chairman said, as part of Hindu Sanatana Dharma Prachara, TTD has released all these religious publications. He said many more books will be brought to light for the sake of the public. The pundits team are rigorously working on the epics, he added.

TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, JEO Medical and Health Smt Sada Bhargavi, Special Officer Sales Wing of Publications Sri Rama Raju, scholars and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స‌ర్వ‌భూపాల‌ వాహ‌న‌సేవ‌లో మత్స్యపురాణం రెండో భాగం, 11 ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ
 
తిరుమల, 2021 ఫిబ్ర‌వ‌రి 19: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవంలో భాగంగా సాయంత్రం జ‌రిగిన స‌ర్వ‌భూపాల వాహ‌న‌సేవ‌లో టిటిడి ముద్రించిన మత్స్యపురాణం రెండో భాగంతో పాటు 11 ఆధ్యాత్మిక పుస్త‌కాల‌ను టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆవిష్క‌రించారు.
 
వీటిలో నారాయ‌ణమంత్రం, శ్రీ దేవీభాగ‌వ‌తం, నిత్యార్చ‌న‌, ప్రాయ‌శ్చిత్తకాండ‌, మ‌న‌చుట్టూ పెరిగే మొక్క‌లు, ఔష‌ధ ఆధ్యాత్మిక విలువ‌లు, భార‌తీయ ప‌విత్ర పుణ్య‌క్షేత్రాలు, ధ‌ర్మ‌వ్యాదోపాఖ్యానం, న‌లోపాఖ్యానం, య‌యాతిచ‌రిత్ర‌, తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌(హిందీ), మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ ఔర్ ఉన్కా ర‌మా ప‌రిణ‌య్‌(హిందీ) పుస్త‌కాలు ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా పుస్త‌క ర‌చ‌యిత‌ల‌ను శాలువ‌, శ్రీ‌వారి ప్ర‌సాదంతో ఘ‌నంగా స‌న్మానించారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, బోర్డు స‌భ్యులు శ్రీమతి ప్రశాంతిరెడ్డి, శ్రీమతి నిశ్చిత, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ సి.ప్రసాద్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ప్రెస్, సేల్స్ వింగ్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.