PLAVA NAMA SAMVATSARA PANCHANGAM RELEASED _ శ్రీ ప్ల‌వనామ సంవ‌త్స‌ర సిద్ధాంత పంచాంగం ఆవిష్క‌ర‌ణ

Tirumala, 19 Feb. 21: On the auspicious day of Radhasapthami TTD has released Plava Nama Samvatsara Telugu Panchangam in front of Sarvabhoopala Vahanam in Tirumala on Friday evening.

TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Dr KS Jawahar Reddy released this Panchangam.

TTD has been publishing Panchangam in connection with Telugu and Tamil New Year day festivities respectively since many decades. The dates, festivals, occasions, etc.in this Panchangam have been decided and fixed by the TTD Asthana Panchangakarta Sri Tangirala Venkata Krishna Purna Prasad Siddhanti and renowned Vaikhanasa Agama Scholar Dr Vedantam Vishnubhattacharyulu.

Additional EO Sri AV Dharma Reddy, JEO (Health and Education) Smt Sada Bhargavi, SO Publications Sri Ramaraju and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స‌ర్వ‌భూపాల‌ వాహ‌న‌సేవ‌లో శ్రీ ప్ల‌వనామ సంవ‌త్స‌ర సిద్ధాంత పంచాంగం ఆవిష్క‌ర‌ణ
 
తిరుమల, 2021 ఫిబ్ర‌వ‌రి 19: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవంలో భాగంగా సాయంత్రం జ‌రిగిన స‌ర్వ‌భూపాల వాహ‌న‌సేవ‌లో శ్రీ ప్ల‌వనామ సంవ‌త్స‌ర సిద్ధాంత పంచాంగాన్ని టిటిడి  ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆవిష్క‌రించారు.
 
ధర్మప్రచారంలో భాగంగా టిటిడి ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా రాబోయే శ్రీ ప్ల‌వ‌నామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా రెండు నెలల ముందుగానే ముద్రించింది. టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటపూర్ణప్రసాద్‌ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని వైఖాన‌స పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు సులభంగా, అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారు. రాజాధి నవనాయకుల ఫలితాలతోపాటు రాశిఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టిటిడిలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు.  
 
రూ.60/- విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో శనివారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగతా టిటిడి సమాచార కేంద్రాలలో మార్చి 2వ వారం నుండి పంచాంగం అందుబాటులో ఉంటుంది.
 
ఈ కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, బోర్డు స‌భ్యులు శ్రీమతి ప్రశాంతిరెడ్డి, శ్రీమతి నిశ్చిత, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ సి.ప్రసాద్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ప్రెస్, సేల్స్ వింగ్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.