A RESPLENDENT SHOW BY ARTISTS DURING VAHANA SEVAS_ సూర్యప్రభ వాహనసేవలో కళాకారుల కోలాహలం

Tiruchanoor, 10 Dec. 18: The artistes hailing from different states have performed in front of Vahana sevas in the ongoing Tiruchanoor brahmotsavams providing a colourful feast to the eyes of devotees.

About 74 teams comprising 1450 artistes hailing from Southern states performed in front of Vahanams. Apart from the HDPP artistes, the teams from Dasa Sahitya Project also showcased their skills.

EXECELLENT AUDIO SYSTEM

To enhance the quality of programmes and to have uniformity in the sound system 25 portable amplifier systems with 50watts inbuilt speakers were arranged by Radio and Broadcast wing of TTD which yielded good results.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సూర్యప్రభ వాహనసేవలో కళాకారుల కోలాహలం

తిరుపతి, 2018 డిసెంబరు 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 74 కళాబృందాలలో 1450 మంది కళాకారులు వారికి కేటాయించిన రోజులలో వివిధ కళా ప్రదర్శనలను ప్రదర్శిస్తున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెకు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. సాంప్రదాయ భజనలు, కోలాటాలు, చెక్కభజనలు, పిల్లనగ్రోవి, బల్లారి డ్రమ్స్‌, ఒగ్గుడోలు, బానాల కోలాటం, నందివాజ కుంతి, గురవ కుంతి, కంసల కుంతి, ఆదిమేళం, కీలుగుర్రం, కొంబు నృత్యం, తదితర జానపద కళాబృందాలకు చెందిన కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

కడపజిల్లా వేములవాడ గ్రామానికి చెందిన ”శ్రీ భీమేశ్వర విశాలమ్మతల్లి కోలాటం భజన మండలి”లోని 30 మంది దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారుల కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఇందులో 5 సం|| నుండి 15 సం||లోపు బాల బాలికలు పాల్గొన్నారు. వీరు గత 5 సంవత్సరాలుగా అమ్మవారి బహ్మ్రోత్సవాలలో ప్రదర్శనలు ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన ”శ్రీరంగ డప్పుల బృందం”లోని 16 మంది కళాకారుల డప్పుల వాయిద్యం అద్భుతంగా ఉన్నది. పశ్చిమగోదావరి జిల్లా కోవ్వురుకు చెందిన ”శ్రీ కోదండరామ బాల భక్త భజన మండలి”లోని యువతి, యువకులు 25 మంది ”నాసిక్‌ డోలు” భక్తులను ఆకర్షించింది.

తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన 70 మంది కళాకారుల బృందం కీలుగుర్రం, భజనలు, దిండిగల్లుకు చెందిన 35 మంది కళాకారుల బృందం డోలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలంగాణ రాష్ట్రానికి చెందిన 35 మంది కళాకారులు ”కొమ్ము కోయ నృత్యం” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కళాబృందాలకు స్పీకర్లు, యాంప్లిఫైయర్స్‌

అమ్మవారి వాహనసేవలలో ప్రదర్శనలలో సంగీతం మరింత వినసొంపుగా వినేందుకు వీలుగా 25 పోర్టబుల్‌ యాంప్లిఫైయర్‌ అడ్రస్‌ సిస్టమ్‌ను కళాబృందాలకు టిటిడి అందజేసింది.

ఇందులో మైకు, యాంప్లిఫైయర్‌, బ్లూటూత్‌, పెన్‌ డ్రైవ్‌, 50 వాట్‌ల ఇన్‌బెల్టు స్పీకర్లు కలిగివుంటాయి. వీటిని నాలుగు మాడ వీధులలో కళా బృందాలు తమ ప్రదర్శనలో సంగీతం వినేందుకు వీలుగా సంచార మ్యూజిక్‌ సిస్టంను వినియోగిస్తారు. ఇందులో 50 వాట్‌ల స్పీకర్‌ల వల్ల పాటలు, సంగీతం వినటానికి అహ్లాదకరంగా వుంటుంది. ఇవి సాంప్రదాయబద్ధంగా కనిపించేలా శ్రీవారి తిరునామం, శంఖు చక్రాలు, తోరణాల స్టిక్కర్లుతో అలంకరించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.