GODDESS TAKES TRIVIKRAMA AVATARA ON SURYA PRABHA VAHANA_ సూర్యప్రభ వాహనంపై త్రివిక్రమ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

TIruchanoor, 10 Dec. 18: On the bright sunny day on seventh day morning on Monday, Sri Padmavathi Devi donned Trivikrama Avatara to bless Her devotees on elegant Surya Prabha Vahanam during the ongoing brahmotsavams at Tiruchanoor.

This is one of the main avatars of Lord Vishnu. In Trivikrama avatar Mahavishnu measured the entire universe in three footsteps. Vishnu took the giant form of Trivikraman during the Vamana avatara of his Dasavataras.

As Vishnu conquered the three worlds with his 3 foot setps – earth with his first step, heavens with the second and the underworld with third – he got the name Trivikrama.

Bhagavata Purana states that Mahavishnu took the form of Trivikrama to restore the authority of Indra over the heavens, as it had been taken by Bali chakravarthi. Trivikrama is also one of the 24 Keshava Namas of Lord Vishnu.

With this avatar, the goddess sends a signal that she is always there for the rescue of Her devotees.

Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy,Dy.EO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy and others were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై త్రివిక్రమ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుపతి, 2018 డిసెంబరు 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు త్రివిక్రమ అలంకారంలోని శ్రీ మహావిష్ణువు రూపంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులను సన్మర్గంలో నడిపించేందుకు త్రివిక్రమ అవతారంలో సూర్యప్రభ వాహనంపై అమ్మవారు దర్శనమిచ్చారు. బలి చక్రవర్తిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు దశవతారాలలో వామనవతారం ఒక్కటి. కావున వామనుడినే త్రివిక్రముడంటారని అర్చకులు తెలిపారు.

మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది.

వాహనసేవ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, చంద్రగిరి శాసన సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ గోపినాధ్‌ జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివో అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

డిసెంబరు 11న రథోత్సవం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 8.15 గంటలకు వృశ్చిక లగ్నంలో అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. సర్వాలంకార సంశోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు విహరించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.