ABHISHEKAM HELD TO AMMAVARU AT TIRUCHANOOR _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం

Tiruchanoor, 23 Jun. 21: As part of ongoing Teppotsavams in Ekantam at Tiruchanoor temple, Abhishekam was held to Sri Padmavathi Ammavaru at Sri Krishna Mukha Mandapam on Wednesday.

Deputy EO Smt Kasturi Bai and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం

తిరుచానూరు, 2021 జూన్ 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా 4వ‌ రోజైన బుధ‌‌వారం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి.

ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తుల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కోబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో ఉత్సవర్ల‌కు అభిషేకం చేశారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఊంజ‌ల‌సేవ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.