ABHISHEKAM HELD TO KSHETRAPALAKA RUDRA _ తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

TIRUMALA, 01 MARCH 2022: On the auspicious occasion on Maha Sivaratri, a special Abhishekam was performed to Kshetrapala Rudra located near Gogarbham dam in Tirumala on Tuesday.

After performing Abhishekam to the presiding deity with milk, curd, panner, coconut water and sandal paste, Naivedyam was offered.

Temple officials and Archakas were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

తిరుమల, 2022 మార్చి 01: తిరుమల గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి మంగళవారం వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.