ABHISHEKAM TO SRIVARU AT BADE HANUMAN TEMPLE _ అలహాబాదులో శ్రీవారికి వైభవంగా స్నపనతిరుమంజనం 

Allahabad, Maha Kumbh Mela January 31- As a part of the ongoing MAHAKUMBA MELA-2013 at Allahabad, the Tirumala Tirupati Devasthanams has built a Replica Temple of Lord Balaji in Sector-6 on the banks of River Ganga. In this Connection, on Thursday morning a celestial bath (Snapana Tirumanjanam-usually known as Abhisekam) was performed to the Processional Deities of Lord Balaji by Priests of Balaji Temple at Bade Hanuman Temple in Allahabad.
The celestial bath with sacred items including turmeric, Sandalwood paste, camphor, scented water has been by the team of priests from Balaji Temple led by Agama exponent Sri Sundara Varada Bhattacharya. During the ritual the priests recited Divya Prabhat vachana and Panchasuktas.
 
Later the deities have been decorated with splendid Tulsi garlands which added an extra glamour to the dazzling deities. TTD performed this ritual seeking peace, harmony and prosperity to bestow on the entire mankind.
 
Sri Sri Sri Swaroopananda Swamiji of Sharada Peetham from Visakhapatnam, Sri Ananda Theertha Maharaj from Bade Hanuman Temple, Uttar Pradesh Educational Minister, Sri Rakesh Trivedi and T.T.D Officials also took part in this religious fete.
 
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
 
అలహాబాదులో శ్రీవారికి వైభవంగా స్నపనతిరుమంజనం

తిరుపతి, జనవరి 31, 2013: ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనంగా పిలవబడుతున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, అలహాబాదు నగరంలో కొలువై ఉన్న శ్రీ బడే హనుమాన్‌ ఆలయంలో తితిదే గురువారం నాడు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.
ప్రముఖ ఆగమపండితులు శ్రీ సుందరవదన భట్టాచార్యులు ఆధ్వర్యంలోని అర్చకుల బృందం శ్రీమలయప్పస్వామివా, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజన కార్యక్రమాన్ని పవిత్ర గంగా నది ఒడ్డున కన్నులవిందుగా నిర్వహించారు. పన్నీరు, తేనె, పెరుగు, కొబ్బరినీళ్లు, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నపనతిరుమంజనం స్థానిక భక్తులను భక్తిపారవశ్యానికి లోను చేసింది. ఈ సందర్భంగా దివ్యప్రభాత వచనాన్ని, పంచసూక్తాలను అర్చకులు వళ్లించారు. అభిషేకానంతరం తులసిమాలలతో ఉత్సవమూర్తులను అలంకరించడంతో ఈ కార్యక్రమం ముగిసింది.
కాగా ఈ స్నపనతిరుమంజనం ఉత్సవాన్ని తిలకించేందుకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి, బడే హనుమాన్‌ ఆలయానికి చెందిన శ్రీ ఆనందతీర్థ మహరాజ్‌, ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి శ్రీ రాకేష్‌ త్రివేది, తితిదే అధికారులు, భక్తులు పాల్గొన్నారు.