ACCOMMODATION ARRANGEMENTS REVIEWED_ వైకుంఠ ఏకాదశికి బస ఏర్పాట్లపై జెఈఓ సమీక్ష

Tirumala, 13 Dec. 18: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Thursday evening reviewed on the accommodation arrangements for Vaikuntha Ekadasi with reception wing.

The review meeting was held in the Chamber’s of JEO in Gokulam Rest House. The JEO instructed the reception wing to make hassle free allotment keeping in view previous year experience.

The JEO also clearly instructed the officers concerned to keep about 75% of rest houses in Padmavathi Area sterile on December 16 for the allotments to be made on December 17 from morning hours onwards.

Reception DyEO Sri Balaji, GM Sri Sesha Reddy, OSD Reception Sri Lokanatham and other staffs were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాదశికి బస ఏర్పాట్లపై జెఈఓ సమీక్ష

డిసెంబరు 13, తిరుమల, 2018: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు విచ్చేసే భక్తులకు జరుగుతున్న బస ఏర్పాట్లపై టీటీడీ తిరుమల జేఈవో శ్రీకెఎస్.శ్రీనివాస రాజు గురువారం సాయంత్రం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో గల కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు ఇబ్బందులు పడకుండా గదులు కేటాయించాలన్నారు. డిసెంబర్ 16న తిరుమలలోని పద్మావతి ప్రాంతంలోని 75 శాతం విశ్రాంతి గదులను ఖాళీ చేసి సిద్ధంగా ఉంచుకుని డిసెంబర్ 17వతేదీ ఉదయం నుండి భక్తులకు కేటాయించాలని సూచించారు.

అంతకుముందు తిరుమలలోని పలు ప్రాంతాల్లో గల గదులను జేఈవో తనిఖీ చేసి ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సమావేశంలో టిటిడి రిసెప్షన్ డిప్యూటీ ఈవో శ్రీ బాలాజీ, ట్రాన్స్ పోర్ట్ జనరల్ మేనేజర్ శ్రీశేషారెడ్డి, రిసెప్షన్ ఓఎస్డి శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.