GRAND PUSHPA YAGAM IN SRI PAT_ శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

Tiruchanoor, 13 December 2018: The Special ritual of Pushpa Yagam after the Karthika Brahmotsavams was religiously performed at the Sri Padmavati Ammavari temple on Thursday.

In the afternoon four tonnes of flowers donated to TTD by Tamilnadu, Karnataka, AP and Telangana were brought to Asthana mandapam in grand procession in the temple
The processional deity of Goddess Padmavathi Devi was made to sit on a special platform and tonnes of different varieties of flowers were showered on Her chanting Vedic hymns by the temple priests. This celestial event took place between 5pm to 8pm in Sri Krishna Mukha Mandapam.
TTD Chairman Sri Putta Sudhakar Yadav, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, DyEO Smt Jhansi Rani, Garden Suptd Srinivasulu, VGO Sri Ashok Kumar Goud, AEO Sri K Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy, Garden Manager Sri Janardan Reddy other officials and devotees participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుపతి, 2018 డిసెంబరు 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి గురువారం నాడు అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో రెండు టన్నులు తమిళనాడు, ఒక టన్ను కర్ణాటక, ఒక టన్ను ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు అందించారు.

తొలుత మధ్యాహ్నం 1.00 గంటల ప్రాంతంలో ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.

అనంతరం సాయంత్రం 5.00 నుంచి 8.00 గంటల వరకు శ్రీకృష్ణముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైదికులు వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో తన్మయత్వం చెందారు.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ ఝాన్సీరాణి, గార్డెన్‌ డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీశ్రీనివాసులు, విజివో శ్రీఅశోక్‌కుమార్‌ గౌడ్‌, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, గార్డెన్‌ మేనేజర్‌ శ్రీజనార్ధన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.