* ACCOMMODATION SHORTAGE IS A PERENNIAL PROBLEM _ తిరుమ‌ల‌లో గదుల ఆక్యుపెన్సీ 180 శాతం

Tirumala, 11 August 2022: TTD EO Sri AV Dharma Reddy said on Thursday that with only 7000 rooms available at Tirumala, this would suffice the needs of only 35,000 devotees and accommodation stands as a perennial problem.

Addressing media persons at Annamaiah Bhavan on Thursday, the TTD EO said with over 1 lakh devotees daily turnout after Corona relaxation to Tirumala, the occupancy rate of rooms has registered an all-time high of 180%.

He said it has been an uphill task to provide rooms to all devotees coming to Tirumala as accommodation is going to be a major challenge as was in the past, in the present and even in future. Hence devotees should come to Tirumala for darshan as per their time slots. Both High court and State Governments have put a stay on new constructions in Tirumala.

The TTD EO said about 2000 rooms are made available for online reservation and another 15000 persons could be accommodated in the PACs. Even counters are opened for reservations in the virtual Queue line and as many as 4500 geysers are installed in Tirumala rooms.

AZADI KA AMRIT MAHOTSAVAM IN TTD

The EO Sri AV Dharma Reddy said, it has been instructed that the Tri colour flag should be hoisted atop all the TTD – employees houses as part of Azadi ka Amrit Mahotsav on August 15.

He also said, TTD is contemplating a rally from the Administrative Building to Mahatma Gandhi Statue on the same day after Independence Day celebrations in the Parade Grounds of TTD.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో గదుల ఆక్యుపెన్సీ 180 శాతం

– తిరుమ‌ల‌లో వ‌స‌తి ఇబ్బంది అనివార్యం

– టీటీడీ ఈవో

తిరుమ‌ల‌, 2022 ఆగ‌స్టు 11: తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్న‌వి 7 వేల గ‌దులు మాత్ర‌మే ఉన్నాయ‌ని, ఇందులో 35 వేల మందికి మాత్ర‌మే వ‌స‌తి క‌ల్పించ‌వ‌చ్చ‌ని ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. క‌రోనా త‌రువాత ప్ర‌తి రోజు ల‌క్ష మందికి పైగా యాత్రికులు తిరుమ‌ల‌కు వ‌స్తున్న‌, గదుల ఆక్యుపెన్సీ 180 శాతంగా న‌మోదు అయింద‌ని చెప్పారు.

తిరుమల అన్నమయ్య భవన్‌లో గురువారం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ, తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులంద‌రికి గ‌తంలోనూ, ప్ర‌స్తుతం, భ‌విష్య‌త్తులో కూడా వ‌స‌తి ఏర్పాటు చేయ‌డం క‌ష్ట‌మ‌న్నారు. కావున భ‌క్తులు తిరుప‌తిలోనే వ‌స‌తి పొంది, త‌మ‌కు కేటాయించిన స్లాట్ ప్ర‌కారం ద‌ర్శ‌నానికి రావాల‌న్నారు. కొత్త‌గా గ‌దుల నిర్మాణం చేప‌ట్టకూడ‌ద‌ని ప్ర‌భుత్వం, హైకోర్టు ఆర్డ‌ర్ ఉన్న‌ట్లు చెప్పారు.

గ‌దుల కొర‌త కార‌ణంగా తిరుమ‌ల‌లో వ‌స‌తి కొర‌కు గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉండ‌వ‌ల‌సి వ‌స్తోంద‌న్నారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆన్‌లైన్‌లో రెండు వేల గ‌దులను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కేటాయిస్తున్నామ‌న్నారు. పిఏసిల‌లో మ‌రో 15 వేల మంది వ‌స‌తి పొంద‌వ‌చ్చ‌న్నారు. వ‌ర్చువ‌ల్ క్యూ విధానంలో పేర్లు న‌మోదు చేసుకునేందుకు కౌంట‌ర్లు ఏర్పాటు చేశామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు తిరుమ‌ల‌లోని వ‌స‌తి గ‌దుల‌లో 4 వేల 500 గీజ‌ర్లు ఏర్పాటు చేశామ‌న్నారు.

టీటీడీలో ఆజాదీకా అమృత మ‌హోత్స‌వం

టీటీడీ మ‌రియు అనుబంధ సంస్థ‌ల్లోని అధికార్లు, ఉద్యోగులు ఆజాదీకా అమృత మ‌హోత్స‌వంలో భాగంగా త‌మ ఇళ్ల‌పై జాతీయ జెండాను ఎగుర వేయాల‌న్నారు. ఆగ‌స్టు 15వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నం నుండి గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు ఊరేగింపు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈవో వివ‌రించారు.

జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.