ACTION PLAN SOON TO REPRINT RAMAYANA, BHARATA, BHAGAVATAM BOOKS-JEO(E & H)

TIRUPATI, 01 NOVEMBER 2022: An action plan will be readied soon to reprint epics, Sri Ramayana, Sri Mahabharata and Srimad Bhagavata books, which has a huge demand among devotees, said TTD JEO for Education and Health Smt Sada Bhargavi.

After her inspection to TTD Printing Press and Publications, Sales Wing, Sapthagiri Magazine offices on Tuesday, she said, modernisation of TTD Printing Press, strengthening of Sales Wing of Publications and bringing out Sapthagiri magazine in a more attractive way are top priority areas and discussed with the concerned officials on the same.

She also said, keeping in view the requirements for the next 25 years, the equipment in the Printing Press will be modernised. Similarly, the books which have a huge demand among the public for taking forward Hindu Dharma Prachara in a most effective manner. reprinting of such epics and other books will be taken up soon. “The action plan on all these development activities by the respective departments will be submitted in a week’s time”, she maintained.

 DFO Sri Srinivas, Chief Editor Dr Radha Ramana, Editor Dr Chokkalingam, Special Officer of Printing Press Sri Ramaraju, Publications Wing Special Officer Sri Venkata Krishna Shastry, DEO Sri Bhaskar Reddy were also present.          

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రామాయ‌ణ‌, భార‌త, భాగ‌వ‌త గ్రంథాల పున‌ర్ముద్ర‌ణ‌కు చ‌ర్య‌లు : టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

న‌వంబ‌రు 01, తిరుప‌తి 2022: రామాయ‌ణ‌, భార‌త, భాగ‌వ‌త గ్రంథాల పున‌ర్ముద్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టిటిడి జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి తెలిపారు. మంగ‌ళ‌వారం ఆమె ప్రెస్‌, ప‌బ్లికేష‌న్స్‌, సేల్స్‌వింగ్‌, స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక కార్యాల‌యాల‌ను ప‌రిశీలించారు. ప్రెస్ ఆధునీక‌ర‌ణ‌, సేల్స్ వింగ్ బ‌లోపేతం, స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక మ‌రింతగా ఆక‌ట్టుకునేలా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు.

అనంత‌రం జెఈవో మాట్లాడుతూ ప్రెస్‌ను రాబోయే 25 సంవ‌త్స‌రాల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని యంత్రాలు, ఇత‌ర అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి వారం రోజుల్లో స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. ప‌బ్లికేష‌న్ విభాగాన్ని బ‌లోపేతం చేసి స‌నాత‌న హిందూ ధార్మిక ప్ర‌చారానికి సంబంధించిన గ్రంథాలు, పుస్త‌కాలు, పురాణాలను ప్ర‌జోప‌యోగంలోకి తీసుకొస్తామ‌ని చెప్పారు.

జెఈవో వెంట డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాస్‌, చీఫ్ ఎడిట‌ర్ డా.రాధార‌మ‌ణ‌, ఎడిట‌ర్ డా.చొక్క‌లింగం, ప్రెస్ ప్ర‌త్యేకాధికారి శ్రీ రామ‌రాజు, ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి ఆచార్య రేమిళ్ల వెంక‌ట‌కృష్ణ‌శాస్త్రి, డిఇవో శ్రీ భాస్క‌ర్‌రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.