ADDITIONAL EO REVIEWS ON KARTHIKA DEEPOTSAVAM ARRANGEMENTS AT TIRUPATI ON NOVEMBER 30 _ కార్తీక మహాదీపోత్సవం పై అదనపు ఈఓ సమీక్ష
KANCHI SEER TO TAKE PART
TTD PARADE GROUNDS TO HOST THE EVENT
Tirupati, 25 Nov. 20: As part of month long Karthika Masa Deeksha programme mulled by TTD, Karthika Deepotsavam will be observed on November 30 in Parade Grounds behind TTD Administrative building in Tirupati.
Reviewing on the arrangements for the event of lights at SV Vedic University meeting hall on Wednesday evening, Additional EO Sri AV Dharma Reddy said, Kanchi Sahnkaracharya, Paramapujya Sri Vijayendra Saraswathi will grace the sacred event in Tirupati on November 30.
The Additional EO instructed the engineering officials to make arrangements for the event following all Covid norms.
He reviewed on various entry points, seating arrangements, lighting of lamps, Asta Lakshmi cultural event etc.with concerned heads.
The Additional EO said, Smt Sada Bhargavi, JEO of Health and Education is supervising all arrangements for the event and asked her to execute a rehearsal with the students who will be performing the concert.
Vedic University VC Sri Sudarshana Sharma, RSVP Professor Sri Rani. Sadasivamurthy, CEO SVBC Sri Suresh Kumar, SE 1 Sri Jagadeeshawar Reddy, DE Electrical Sri Ravishankar Reddy, Music College Principal Smt Jamunarani, OSD Higher Vedic Studies Dr A Vibhishana Sharma were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కార్తీక మహాదీపోత్సవం పై అదనపు ఈఓ సమీక్ష.
తిరుపతి, 25 నవంబరు 2020: కంచి మఠం పీఠాధిపతి హాజరు. కార్తీక మాసం సందర్భంగా నవంబరు 30వ తేదీ సాయంత్రం టీటీడీ పరిపాలనా భవనం లోని గ్రౌండ్ లో నిర్వహించనున్న కార్తీక మహా దీపోత్సవం పై అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి బుధవారం సాయంత్రం అధికారులతో సమీక్ష జరిపారు.
వేద విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష కు విసి శ్రీ సుదర్శన శర్మ, జె ఈ ఓ శ్రీమతి సదా భార్గవి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ను పూర్తిగా నాశనం చేయాలని స్వామివారిని ప్రార్థిస్తూ టీటీడీ తొలిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. కంచి మఠం పీఠాధిపతి శ్రీ శ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి కార్యకమానికి హాజరై అనుగ్రహ భాషణం చేస్తారని ఆయన చెప్పారు. జె ఈ ఓ శ్రీమతి సదాభార్గవి ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారని, అధికారులు, కళాకారులు ఆమెకు నివేదించాలని చెప్పారు. కార్యక్రమానికి భారీసంఖ్యలో మహిళలు హాజరవుతున్నందు వల్ల కోవిడ్ 19 నిబంధనల మేరకు వారికి కూర్చునే ఏర్పాట్లు చేయాలని ఇంజినీర్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ విభాగం త్వరగా వారి పనులు పూర్తి చేయాలన్నారు.
కార్యక్రమంలో అష్ట లక్ష్ము ల నృత్య కార్యక్రమం లో పాల్గొనే కళాకారులకు రిహార్సల్స్ నిర్వహించాలన్నారు. గ్రౌండ్ లోకి రావడానికి ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటుచేసి పాసులు జారీ చేయాలని చెప్పారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారానికి అవసరమయ్యే సాంకేతిక ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. వేద స్వస్తి, విష్ణుసహస్ర నామ పారాయణం, దీపలక్షీ పూజ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహిళలు భౌతిక దూరం పాటిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం(దీపాలు వెలిగించడం) కోసం ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు.
ఎస్ ఈ1 శ్రీ జగదీశ్వరరెడ్డి, ఎస్వీబీసీ సి ఈఓ శ్రీ సురేష్ కుమార్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ దక్షిణామూర్తి, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జామున రాణి, విద్యుత్ విభాగం డి ఈ శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్రీ విభీషణశర్మ,జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీరాణి సదాశివమూర్తి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది