ADDITIONAL EO REVIEWS ROUTE PLAN OF ANNAPRASADAM _ శ్రీవారి గరుడ సేవకు విచ్చేసే భక్తుల సౌకర్యాలపై సమీక్షించిన అదనపు ఈవో
TIRUMALA, 01 OCTOBER 2024: TTD Additional EO Sei Ch Venkaiah Chowdhary on Tuesday evening held a review meeting on the arrangements in view of the ensuing annual Brahmotsavams with a special focus on the day of Garuda Seva on October 8.
The meeting was held at Gokulam Rest House. As a part of it the Additional EO verified the cultural teams belonging to various states which will perform in front of Vahanams and gave a few suggestions to the officers concerned.
Later he also studied the action plan chalked out by the Annaprasadam wing that included preparation of food, distribution route plan and coordination with other departments towards ensuring seamless delivery of Annaprasadam in the galleries.
Transport GM Sri Sesha Reddy, DyEOs Sri Rajendra, Smt Asha Jyothi, HDPP officials, Vigilance officials were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి గరుడ సేవకు విచ్చేసే భక్తుల సౌకర్యాలపై సమీక్షించిన అదనపు ఈవో
తిరుమల, 2024 అక్టోబరు 01: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్టోబరు 8న జరిగే గరుడసేవకు లక్షలాదిగా విచ్చేసే భక్తులపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో మంగళవారం సాయంత్రం అదనపు ఈవో గరుడ సేవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
అందులో భాగంగా వాహనముల ముందు ప్రదర్శించే వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక బృందాల ప్రదర్శనలకు సంబంధించిన వీడియోను అదనపు ఈఓ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
తర్వాత ఆయన అన్నప్రసాదం విభాగం రూపొందించిన నాలుగు మాడ వీధులలో అన్న ప్రసాద వితరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కూడా అధ్యయనం చేశారు. ఇందులో అన్నప్రసాదాల తయారీ, పంపిణీ మార్గాలు మరియు గ్యాలరీలలో ఉన్న భక్తులకు సజావుగా అన్నప్రసాదాలు పంపిణీ అయ్యేలా ఇతర విభాగాలతో సమన్వయం చేయడం వంటివి ఉన్నాయి.
ఈ సమావేశంలో రవాణా శాఖ జిఎం శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీమతి ఆశాజ్యోతి, హెచ్‌డీపీపీ , విజిలెన్స్ తదితర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.