ADDITIONAL EO REVIEWS TTD FEEDBACK MECHANISM _ టీటీడీ అభిప్రాయ సేకరణ వ్యవస్థపై అదనపు ఈవో సమీక్ష
Tirumala, 11 November 2026: TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary on Wednesday reviewed the functioning of TTD’s feedback mechanism, devotees’ suggestions and grievance redressal system at Sudharma Meeting Hall in Sri Padmavathi Rest House in Tirumala.
He directed officials to improve facilities based on devotees’ feedback, establish a reception counter at the Annaprasadam complex and create awareness on water and electricity conservation.
He also stressed improving cleanliness and basic amenities in accommodation complexes, monitoring the Nandakam App daily and resolving technical issues within 24 hours.
Instructing concerned officials further he told them to install CCTV cameras and complaint boxes at luggage counters to ensure devotees’ safety and convenience.
The heads of all Departments in Tirumala participated in the review meeting.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీ అభిప్రాయ సేకరణ వ్యవస్థపై అదనపు ఈవో సమీక్ష
తిరుమల, 2026 నవంబర్ 11: టీటీడీ అభిప్రాయ సేకరణ వ్యవస్థ పనితీరు, భక్తుల నుంచి అందుతున్న అభిప్రాయాలు, ఫిర్యాదుల పరిష్కారంపై బుధవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు టీటీడీ సేవలపై భక్తుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సేకరించి, వాటి ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదం కేంద్రంలో భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి పొదుపు, విద్యుత్ పొదుపుపై భక్తులకు అవగాహన కల్పిస్తూ, వనరులు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వసతి సముదాయాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. నందకం యాప్ పనితీరును ప్రతిరోజూ నిరంతరం పర్యవేక్షించాలని, యాప్లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 24 గంటల్లోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లగేజీ కౌంటర్ల వద్ద భక్తుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా సీసీటీవీ కెమెరాలు, ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయాలని సూచించారు.
భక్తుల అభిప్రాయాలు, సూచనలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటూ టీటీడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు ఈవో తెలిపారు.
ఈ సమావేశంలో వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

