ADDITIONAL EO TAKES PART IN AKALA MRUTYU HARANA HOMAM _ అకాల‌మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞంలో పాల్గొన్న టిటిడి అద‌న‌పు ఈవో

Tirupati, 6 January 2021: TTD Additional EO Sri AV Dharma Reddy took part in the Akala Mrutyu Harana Maha Yagnam in Kapileswara Swamy temple in Tirupati on Wednesday.

Seeking the divine intervention to protect the humanity from the clutches of Corona, TTD has mulled Akala Mrutyu Harana Maha Yagnam in Kapileswara Swamy temple in Tirupati which commenced on December 30 last. This fete will last till January 20.

A total of 51 Krishna Yajurveda Pundits from AP, Tamilnadu, Karnataka have been performing this Yagnam every day between 9am and 12noon and between again 4pm and 6pm.

Temple DyEO Sri Subramanyam, Annamacharya Project Director Sri Dakshinamurthy, Project Officer of Higher Vedic Studies Sri Vibhishana Sharma, Superintendent Sri Bhupati were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అకాల‌మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞంలో పాల్గొన్న టిటిడి అద‌న‌పు ఈవో

తిరుప‌తి, 2021, జనవరి 06: విశ్వంలోని స‌క‌ల‌ప్రాణికోటికి మృత్యు భ‌యం తొల‌గి ఆయురారోగ్యాలు, అష్టైశ్వ‌ర్యాలు క‌ల‌గాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తూ తిరుప‌తిలోని క‌పిల‌తీర్థం ప్రాంగ‌ణంలో జ‌రుగుతున్న అకాల‌మృత్యుహ‌ర‌ణ మ‌హాయ‌జ్ఞంలో బుధ‌వారం టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

డిసెంబ‌రు 30న ప్రారంభ‌మైన ఈ మ‌హాయ‌జ్ఞం జ‌న‌వ‌రి 20వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది. త‌మిళ‌నాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 51 మంది కృష్ణ‌య‌జుర్వేద పండితులు, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఆచార్యులు ఈ మ‌హాయ‌జ్ఞాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఇందులో య‌జ్ఞం, జ‌పం, త‌ర్ప‌ణం క్ర‌తువులు చేప‌డుతున్నారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 9 నుండి 12 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఈ య‌జ్ఞం జ‌రుగుతోంది.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.