JEO INSPECTS COLLEGES AND QUARTERS _ టిటిడి క‌ళాశాల‌లు, ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌ను త‌నిఖీ చేసిన‌ జెఈవో

Tirupati, 6 January 2021: TTD JEO for Health and Education, Smt Sada Bhargavi, on Wednesday inspected various TTD Colleges and Employees Quarters in Tirupati.

As part of her inspection she visited S V Oriental College and instructed the Engineering officials to complete the pending works on a fast pace. She directed them to plan seating arrangements in a circular manner for the students and erect notice boards wherever necessary in the college.

At SPW Polytechnic College she directed the Engineering Officials, Additional Health Officer and DFO to prepare an action plan to make use of the under utilized quarters located adjacent to the college. She also instructed the Forest wing officials to develop greenery amd Additional HO to maintain hygiene in the available space.

During her inspection at Vinayaka Nagar Quarters, the JEO visited the playground and instructed the engineering officials to prepare the ground to celebrate Sankranti as in the case of last year. She also directed them to erect the boards with timings, to avoid the of anti social incidents in the playground for the safety of employees and their dependents.

SE Electrical Sri Venkateswarulu, DEO Sri Govindarajan, Additional HO Dr Sunil Kumar, Estates Officer Sri Mallikarjuna were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి క‌ళాశాల‌లు, ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌ను త‌నిఖీ చేసిన‌ జెఈవో

తిరుప‌తి, 2021, జనవరి 06: టిటిడి ఆధ్వ‌ర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌, శ్రీ వేంక‌టేశ్వ‌ర ఓరియంట‌ల్ క‌ళాశాల‌తోపాటు ఉద్యోగుల వినాయ‌క న‌గ‌ర్ క్వార్ట‌ర్స్‌ను బుధ‌వారం టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి త‌నిఖీ చేశారు.

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల హాస్ట‌ల్లో విద్యార్థినుల‌‌కు క‌ల్పించిన వ‌స‌తుల‌ను జెఈవో ప‌రిశీలించారు. ‌క‌ళాశాల గ్రంథాల‌యంలో విద్యార్థినులు సౌక‌ర్య‌వంతంగా చ‌దువుకునేలా క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పుస్త‌కాలు ఏర్పాటు చేయాలని, క‌ళాశాల ప్రాంగ‌ణంలో అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో మొక్క‌లు పెంచాల‌ని, అవ‌స‌ర‌మైన పారిశుద్ధ్య సామ‌గ్రి అందుబాటులో ఉంచుకోవాల‌ని, క‌ళాశాల, హాస్ట‌ల్ భ‌వ‌నాల్లో చేప‌ట్టాల్సిన సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్ ప‌నుల‌ను ఇంజినీరింగ్ అధికారుల స‌మన్వ‌యంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ అంశాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు నోడ‌ల్ అధికారుల‌ను ఏర్పాటు చేయాల‌ని క‌ళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు. క‌ళాశాల హాస్ట‌ల్ ప‌క్క‌న నిరుప‌యోగంగా ఉన్న క్వార్ట‌ర్స్‌ను ఉప‌యోగంలోకి తీసుకురావాలని అధికారుల‌ను ఆదేశించారు.

ఎస్వీ ఓరియంట‌ల్ క‌ళాశాల‌లో అభివృద్ధి ప‌నుల‌ను నిర్ణీత వ్య‌వ‌ధిలోపు పూర్తి చేయాల‌ని, త‌ర‌గ‌తి గ‌దుల్లో వ‌ల‌యాకారంలో సీటింగ్ ఏర్పాటు చేయాల‌ని, త‌ర‌గ‌తి గ‌దులు, మ‌రుగుదొడ్లు, క‌ళాశాల ప్రాంగ‌ణంలో అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు, జాగ్ర‌త్త‌లు తెలిపే ‌బోర్డులు ఏర్పాటు చేయాల‌ని, సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, వాట‌ర్ వ‌ర్క్స్ మ‌ర‌మ్మ‌తుల‌ను పూర్తి చేయాల‌ని జెఈవో ఆదేశించారు.

వినాయ‌క న‌గ‌ర్ క్వార్ట‌ర్స్‌లో నివాస‌ముండే ఉద్యోగుల కుటుంబాల భ‌ద్ర‌త కోసం మైదానంలో అసాంఘిక చ‌ర్య‌లు జ‌ర‌గ‌కుండా నివారించాల‌ని, బోర్డు ఏర్పాటుచేసి నిర్ణీత స‌మయంలో మాత్ర‌మే ఆడుకునేందుకు అనుమ‌తించాల‌ని జెఈవో సూచించారు. గ‌తేడాది త‌ర‌హాలోనే సంక్రాంతి సంబ‌రాల‌ను నిర్వ‌హించేందుకు మైదానంలో త‌గిన ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

జెఈవో వెంట టిటిడి ఎస్టేట్ అధికారి శ్రీ మ‌ల్లికార్జున‌, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, విద్యాశాఖాధికారి శ్రీ గోవింద‌రాజ‌న్‌, అద‌న‌పు ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్ కుమార్ ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.