ADHYANOTSAVAMS COMMENCE AT SRIVARI TEMPLE_ శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
Tirumala, 18 December 2017: As part of the Adhyayanotsavams Divya prabhandam ghosti was performed at the Srivari Temple after the utsava idols of Malayappaswamy along with consorts Sri Devi and Bhudevi were installed at Ranganayukula mandapam.
As per tradition the holy ritual of Adhyayanotsavam is performed 11 days before the Vaikunta Ekadasi every year.
The Srivaishnava Jeeyangars will recite the 4,000 stanzas of Divya prabandam scripted by the 12 Alwars in the temple for 25 days.While the first 11 days are termed as Pagalvattu, the 10 other days tagged as RAvattu and on the 22nd day the Kanniman Shirathambu, 23rd day Ramanuja Matramdadi and 24th day Sri Varahaswamy Sattumora and 25th-day Tannirmudu recitals are conducted for completion of the Adhyayanotsavam ritual.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
డిసెంబరు 18, తిరుమల 2017: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాత్రి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమౌతుంది.
ఈ సందర్భంగా శ్రీవైష్ణవ జీయంగార్లు స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్టిగానం చేస్తారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.
కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని పిలుస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున తణ్ణీరముదు ఉత్సవంతో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.