TTD EO INSPECTS SSD COUNTERS_ సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన ఈవో

Tirumala, 18 December 2017: TTD Executive Officer Sri Anil Kumar Singhal inspected the experimental SSD counters set up at Tirumala for facilitating the common devotees going for Sarva darshan launched today.

He visited the innovative and experimental SSD counters set up at CRO at Monday night to review the manner in which tokens were issued and also interacted directly with the devotees who expressed their satisfaction.

Earlier he inspected the queue lines of common devotees at Narayanagiri gardens who had come to VQC-2 without procuring the SSD tokens and urged them to take advantage of the new facility to obtain easy and smooth darshan of Lord Venkateswara. He also directed the officials to ensure quick supply of coffee, tea, milk, snacks and also drinking water.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri Ake Ravi Krishna, Chief Engineer Sri Chandrasekhar Reddy, SE-2, Sri Ramachandra Reddy, DyEO Temple Sri Kodandarama Rao, Transport GM Sri Sesha Reddy, AVSO Sri Ravindra Reddy also participated in the EO’s inspection visit.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన ఈవో

డిసెంబరు 18, తిరుమల 2017: తిరుమలలోని సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను సోమవారం రాత్రి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పరిశీలించారు. ఇందులో భాగంగా కేంద్రీయ విచారణ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన కౌంటర్లను తనిఖీ చేశారు. టోకెన్ల మంజూరు తీరును పరిశీలించారు. అక్కడి భక్తులతో ఈవో నేరుగా మాట్లాడి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విధానంపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

ముందుగా, నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లను ఈవో పరిశీలించారు. ఆ తరువాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోకి ప్రవేశించి టోకెన్లు పొందకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడారు. సమయ నిర్దేశిత సర్వదర్శన విధానంపై వారికి అవగాహన కల్పించారు. ఆధార్‌కార్డుతో వచ్చిన పక్షంలో ఎక్కువసేపు వేచి ఉండే అవసరం లేకుండా నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఆ తరువాత కంపార్ట్‌మెంట్లలోని భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, టి, కాఫి అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈవో వెంట తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.