ADHYAYANOTSAVAMS COMMENCES IN SRI TT _ శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

Tirumala, 14 Dec. 20: The 25-day festival, Adhyayanotsavams commenced at Ranganayakula Mandapam in Tirumala temple on Monday evening.

This lengthiest annual festival among the galaxy of religious fests that takes place in Tirumala shrine usually commences 11 days before Vaikuntha Ekadasi.

The uniqueness of this festival is that the 4000 hymns written by 12 Alwars, known as Nalayira Divyprabandha Pasurams will be recited every day during these 25 days by Sri Vaishnavaites.

First 11 days are known as Pagalpattu, next 10 days as Rapathu, while on 22nd day Kanninun Siruttambu, 23rd day Ramanuja Nutrandadi, 24th day Sri Varaha Swamy Sattumora will be observed and on final day the festival concludes.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

తిరుమల, 2020 డిసెంబరు 14: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు సోమ‌వారం ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు. ధనుర్మాసంలో  వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.

కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌‌స్వామి, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.
                 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.