ADHYAYANOTSAVAMS IN SRI GT _ జనవరి 10 నుండి ఫిబ్రవరి 2 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
Tirupati, 05 January 2023: The 25-day fest of Adhyayanotsavams will commence on January 10 and conclude on February 2 in Sri Govindaraja Swamy temple in Tirupati.
Every day there will be special kainkaryam to the utsava deities of Sri Bhu sameta Sri Govindaraja, Viswaksena and Alwars between 7pm and 8pm.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 10 నుండి ఫిబ్రవరి 2 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
తిరుపతి, 05 జనవరి 2024: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 10 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి.
ప్రతి ఏడాదీ ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా జనవరి 20న చిన్నశాత్తుమొర, జనవరి 26న ప్రణయ కలహోత్సవం, జనవరి 30న పెద్దశాత్తుమొర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.