ADHYAYANOTSAVAMS IN TIRUMALA FROM DECEMBER 22 ONWARDS _ డిసెంబరు 22 నుంచి జనవరి 15వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
TIRUMALA, 15 DECEMBER 2022: The annual Adhyayanotsavams will be observed in Tirumala temple for 25-days from December 22 till January 15 next.
This lengthiest annual festival among the galaxy of religious fests that takes place in Tirumala shrine usually commences 11 days before Vaikuntha Ekadasi.
The uniqueness of this festival is that all the 4000 hymns penned by 12 Alwars, known as Nalayira Divyprabandha Pasurams will be recited every day during these 25 days by Sri Vaishnavaites.
First 11 days are known as Pagalpattu, next 10 days as Rapathu, while on 22nd day Kanninun Siruttambu, 23rd day Ramanuja Nutrandadi, 24th day Sri Varaha Swamy Sattumora will be observed and on final day the festival concludes.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
డిసెంబరు 22 నుంచి జనవరి 15వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
డిసెంబరు 15, తిరుమల, 2022: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 22 నుండి 2023 జనవరి 15వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమౌతుంది.
ఈ సందర్భంగా శ్రీవైష్ణవ జీయంగార్లు స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.
కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.