TTD JEO OPENS SRIVANI TRUST COUNTER AT TPT AIRPORT _ తిరుపతి ఎయిర్పోర్టులో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్ ప్రారంభించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం 

TIRUPATI, 15 DECEMBER 2022: TTD JEO Sri Veerabrahmam opened up an exclusive counter for issuing SRIVANI Trust tickets in Tirupati Airport on Thursday morning.

 

Speaking on the occasion he said, SRIVANI Trust has gained popularity and is running successfully. The funds obtained by this Trust through donations are being utilised towards the construction of temples in remote areas. Recently TTD has taken a decision to issue SRIVANI tickets in Madhavam Rest House in Tirupati itself along with accommodation subject to the availability of rooms in the rest house. 

 

The management also thought it would be beneficial for those who are coming to Tirupati in different Airlines. They can book the SRIVANI tickets in the Airport itself, stay in the nearby rest houses, and make use of the facility. 

 

Chief Engineer Sri Nageswara Rao, Airport Director Sri Raj Kishore, DGM Terminal Sri Chandrakant, Airport Commercial Manager Sri Avinash, Terminal Manager Sri Manideep, TTD GM IT Sri Sandeep, Tirupati HDFC branch manager Sri Srikanth Reddy were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుపతి ఎయిర్పోర్టులో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్ ప్రారంభించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 15 డిసెంబర్ 2022: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు గురువారం నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే మంజూరు చేస్తున్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ ను జేఈవో శ్రీ వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు.

అనంతరం శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్టుకు రూ 10 వేలు విరాళం ఇచ్చి టికెట్ కోసం రూ. 500 చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేసేవారని చెప్పారు. దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుపతి ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎయిర్పోర్ట్ ,తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల దాతలు ముందురోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి మాధవంలో వారికి వసతి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు . తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన కౌంటర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యాజమాన్యానికి జేఈవో కృతజ్ఞతలు తెలిపారు.

టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డీజీఎం టెర్మినల్ శ్రీ చంద్రకాంత్, కమర్షియల్ మేనేజర్ శ్రీ అవినాష్ టెర్మినల్ మేనేజర్ శ్రీ మణిదీప్, టీటీడీ ఐటి విభాగం జి ఎం శ్రీ సందీప్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు మేనేజర్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది.