ADHYAYANOTSAVAMS IN TIRUMALA TEMPLE FROM DECEMBER 7_ డిసెంబరు 7 నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Tirumala, 5 Dec. 2018: The annual Adhyayanotsavams will commence in Sri Tirumala temple from December 7 and last till December 31
This 25 day festival will commence eleven days prior to Vaikuntha Ekadasi festival. The Nalayira Divya Prabandha Pasura Parayanam penned by 12 Alwars will be rendered on this occasion.

The first eleven days are known as Pagalpattu, the next ten days are called Rapattu, 22nd day is Kanninun Siruttambu, 23rd day Ramanuja Nutrandadi, 24th day Sri Varahaswamy Sattumora and concludes with Tanniramudu Utsavam on 25th day.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

డిసెంబరు 7 నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

డిసెంబరు 06, తిరుమల, 2018: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 7 నుండి 31వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమౌతుంది.

ఈ సందర్భంగా శ్రీవైష్ణవ జీయంగార్లు స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.

కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.