ADIBHATLA PIONEERED HARIKATHA _ హరికథకు ఆద్యుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాస : డా|| సముద్రాల లక్ష్మణయ్య మహతిలో శ్రీ ఆదిభట్ల 154వ జయంతి ఉత్సవాలు ప్రారంభం
Tirupati, 06 September 2018:Describing Harikatha exponent Sri Ajjada Adibhatla Narayana Dasu as multifaceted towering personality, scholars unanimously said he pioneered Harikatha Parayanam.
In connection with 154th Birth Anniversary of the stalwart, special lectures was held in Mahati auditorium. Speaking on this occasion, Puranetihasa Project coordinator Dr Samudrala Lakhmanaiah said Sri Ajjada presented Harikatha with Bhava, Raga, Tala, Natana and Vacha vaisishtyam.
Later sri Amudala Murali also spoke on this occasion.
SV College of Music and Dance Principal Smt Padmavathi was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
హరికథకు ఆద్యుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాస : డా|| సముద్రాల లక్ష్మణయ్య
మహతిలో శ్రీ ఆదిభట్ల 154వ జయంతి ఉత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2018 సెప్టెంబరు 06 ;బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస గొప్ప కళారూపమైన హరికథకు ఆద్యుడిగా నిలిచారని టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య ఉద్ఘాటించారు. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీ నారాయణదాస 154వ జయంతి ఉత్సవాలు గురువారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన డా|| సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ నారాయణదాస కవిగా, సంగీతకారుడిగా, న త్యకారుడిగా, తత్వవేత్తగా గుర్తింపు పొంది తెలుగువారికి గర్వకారణంగా నిలిచారన్నారు. ఈయనకు సంస్కృతం, తెలుగు, హిందీ, బెంగాళి, ఉర్దూ, పర్షియన్, అరబిక్, ఇంగ్లీషు భాషల్లో పాండిత్యం ఉందని చెప్పారు. సంగీతం-న త్యం-సాహిత్యం మేళవింపే హరికథ అని, ఇలాంటి అరుదైన కళారూపాన్ని పరిరక్షించి భావితరాలకు అందించేందుకు టిటిడి కృషి చేస్తోందని తెలిపారు.
అనంతరం తిరుపతికి చెందిన శతావధాని శ్రీ ఆముదాల మురళి ”ఆదిభట్లవారి విశిష్ట రచనలు” అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. ఆ తరువాత తిరుపతికి చెందిన శ్రీమతి వి.విజయకుమారి బృందం రుక్మిణీ కల్యాణం హరికథా గానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వైవిఎస్.పద్మావతి, అధ్యాపకులు శ్రీ వేంకటేశ్వర్లు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.