APPALAYAGUNTA REOPENS AFTER MAHA SAMPROKSHANAM _ శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

Appalayagunta, 06 September 2018:After Jeernodharana and Maha Samtoshanam, Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta resumed it’s darshanam of mula virat on Thursday.

Tirupati Jeo Sri P Bhaskar who took part in this fete said, Balalayam was observed and renovation works were taken up since August 6 for about a month. We have resumed darshanam of the presiding deity from today onwards after performing Maha Samprokshanam poornahuthi.

Temple Spl.Gr.Dy.E.O.Sri Muniratnam Reddy and other staffs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

సెప్టెంబరు 06, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ గురువారం శాస్త్రోక్తంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ ఆగస్టు 6వ తేదీ నుండి నెల రోజుల పాటు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి గర్భాలయం, ద్వారపాలకులు, గరుడాళ్వారు, ఆళ్వార్లు, ధ్వజస్తంభం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఆలయం, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయాలలో జీర్ణోద్ధారణ (ఆధునీకరణ పనులు) చేపట్టామన్నారు. అనంతరం సెప్టెంబరు 2వ తేదీ ఆదివారం నుండి వైఖానస ఆగమోక్తంగా అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ రోజు మహాపూర్ణాహుతి, మహాసంప్రోక్షణం కార్యక్రమాలు జరిగాయన్నారు.

కాగా, గురువారం ఉదయం 7 గంటలకు మహాపూర్ణాహుతి, ఉదయం 7.50 నుండి 8.30 గంటల వరకు మహాసంప్రోక్షణం కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిగాయి. అనంతరం రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఆగమసలహాదారు శ్రీ సుందరవరదన్‌, కంకణబట్టర్‌ శ్రీసూర్యకుమారాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణ, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, 30 మంది వేద పండితులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.