ADMISSIONS COUNSELLING FROM JUNE 10_ జూన్ 10 వ తేదీ నుండి టిటిడి డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో కౌన్సిలింగ్ ప్రారంభం

Tirupati, 7 Jun. 19: The counselling for admissions in the TTD educational institutions for students who applied online will commence from June 10 onwards.

The counselling for admissions in SPW Degree College, Sri Padmavathi Junior College, and SV Junior College will be held in the concerned premises of the institutions. Similarly, the counselling for SV Arts College, SGS Arts College will be held at the Sri Govindarajaswamy Arts College premises.

The dates of counselling have been intimated to all students category wise through SMS on their registered mobiles and also through e-mails. The schedule of counselling has also been updated in the TTDs admissions website.

Henceforth all students were also advised to bring originals as required in the prospectus and appear before counselling Centres as per schedule.

The TTD said in a statement that the Students who do not appear for counselling and submit originals and pay prescribed fees will not be eligible for admissions thereafter. In all 30,202 boys and girls filled up online admissions forms.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూన్ 10 వ తేదీ నుండి టిటిడి డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో కౌన్సిలింగ్ ప్రారంభం

తిరుపతి, 2019 జూన్ 07: టిటిడిలోని డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో 2019-20వ విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్ధిని విద్యార్ధుల‌కు జూన్ 10వ తేదీ నుండి కౌన్స్‌లింగ్ ప్రారంభం కానుంది.

శ్రీ ప‌ద్మావ‌తి జూనియ‌ర్ క‌ళాశాల‌, ఎస్వీ జూనియర్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాలలో జూన్ 10వ తేదీ నుండి ఆయా క‌ళాశాలల ప్రాంగ‌ణాల‌లో కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అదేవిధంగా ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో ప్ర‌వేశాల‌కు జూన్ 14వ తేదీ శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో కౌన్సిలింగ్ జ‌రుగ‌నుంది. , ఆయా కేటాగిరి విద్యార్థులు ఆయా తేదీల‌లో కౌన్సిలింగ్‌కు హాజ‌రుకావ‌ల‌సిన విష‌యాన్ని ప్ర‌తి విద్యార్థి మొబైల్ నంబ‌రుకు ఎస్ఎమ్ఎస్ మ‌రియు ఈ- మెయిల్ పంపడం జ‌రిగింది. కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను అడ్మిన్ వెబ్‌సైట్ యందు షెడ్యుల్
బాక్స్‌లో పొందు ప‌ర‌చ‌డ‌మైన‌ది. కావున విద్యార్థిని విద్యార్థులు వారి ఈ-మెయిల్ నందు కానీ లేదా అడ్మిన్ వెబ్‌సైట్ యందు విద్యార్థులు ప్రాస్పెక్ట‌స్ లో తెలిపిన విధంగా ఒరిజిన‌ల్ టిసిని, అన్ని ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను మ‌రియు నిర్ణిత రుసుంతో కౌన్సిలింగ్‌కు హాజ‌రుకావ‌లేను. కౌన్సిలింగ్ షెడ్యూల్ జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి వారికి కేటాయించిన తేదీల‌లో కౌన్సిలింగ్ కేంద్రాల‌కు హాజ‌రుకావ‌లేను. ఆయా తేదీల‌లో కౌన్సిలింగ్‌కు హాజ‌రుకాని విద్యార్థులు, అవస‌ర‌మైన ధృవీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించ‌నివారు, నిర్ణిత రుసుం చేల్లించ‌ని వారికి ప్ర‌వేశం క‌ల్పించ‌డం జ‌రుగ‌దు.

టిటిడి క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి ఆన్‌లైన్‌లో 30,202 మంది విద్యార్థిని విద్యార్ధులు నిర్ణిత స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అనివార్య సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ప్ర‌వేశాల‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌డానికి, స్లైడింగ్ ఎంచుకునే స‌దుపాయ‌ము విద్యావిభాగం క‌ల్పించ‌లేకపోతున్న‌ది. ఈ విష‌యాన్ని విద్యార్థులు గ‌మ‌నించ‌గ‌ల‌రు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.