BTUs OF HYDERABAD SV TEMPLE FROM JUNE 9-13_ హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 7 Jun. 19: TTD plans to grandly conduct the annual Brahmotsavams of Sri Venkateswara temple at Balaji Bhavan in Himayatnagar at Hyderabad from June 9 -13 with Ankurarpanam on June 8.
The schedule of events at the five day festival were : Dwajarohanam and Sesha vahanam on June 9, snapana thirumanjanam in morning and Hanumanta vahanam on the evening of June 10, Gaja vahanam and Garuda vahanam on June 11, Rathotsavam and Aswa vahanam on June 12, Chakrasnanam and Pushpa yagam followed by Dwajavarohanam on June 13.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2019 జూన్ 07: హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో గల బాలాజీ భవన్‌లో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 9 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహించనుంది.
ఈ ఉత్సవాలకు జూన్ 8వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. జూన్ 9న ఉదయం 8.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదేరోజు రాత్రి శేష వాహనంపై స్వామివారు విహరిస్తారు. అలాగే జూన్ 10న ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, రాత్రి హనుమంత వాహనసేవ జరుగనుంది. జూన్ 11న ఉదయం గజవాహనం, రాత్రి గరుడసేవ నిర్వహిస్తారు. జూన్ 12న ఉదయం 7.30 గంటలకు రథోత్సవం, రాత్రి అశ్వవాహనసేవ జరుగనున్నాయి. జూన్ 13న ఉదయం 10 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, రాత్రి ధ్వజావరోహణం వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.