ADMISSIONS OPEN IN TTD VEDAPATHASALA_ టిటిడి వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, 20 April 2018 ; Admissions are open and applications are invited for studies in all the seven TTD run SV Veda pathashalas in Telugu states for the academic year of 2018-19 .

They are Dharmagiri(Tirumala), Keesaragutta (RRDis), Chilkur(Moinabad Mandal RR Dist) and Nalgonda in Telangana Bhimavaram WG Dist AP), Vizianagaram,and Kottapakonda in Guntur Dist.

All eligible students-boys who had Upanayanam as per traditions for vedic studies,with prescribed age and qualifications are requested to apply for the various courses by June 15,2018.

They are advised to log in www.tirumala.org / www.tirupati.org for more details about courses,age, and other concessions offered by the TTD for pursuing vedic studies.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

టిటిడి వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏప్రిల్‌ 20, తిరుపతి 2018: 2018 -19 విద్యాసంవత్సరానికి గాను టిటిడి వేద పాఠశాలలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించడమైనది. టిటిడి ఆధ్వర్యంలో నడపబడుచున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలలు 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, కీసర మండలం, రంగారెడ్డి జిల్లా 3. చిలుకూరు, మోయింబాద్‌ మండలం, రంగారెడ్డి జిల్లా 4. ఐ. భీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా 5. విజయనగరం, 6. నల్గొండ, 7. కోటప్పకొండ, గుంటూరు జిల్లాల నందు వేద పాఠశాలలు ఉన్నాయి.

ఈ పాఠశాలలో వివిధ కోర్సులలో ప్రవేశం కొరకు అర్హులైన బాలుర నుండి టిటిడి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వైదిక సాంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి మరియు నిర్ణీత వయస్సు మరియు విద్యా ప్రమాణాలు కలిగిన వారు ఇందుకు అర్హులు. 2018, జూన్‌ 15వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పైన తెలిపిన పాఠశాలలో వివిధ కోర్సుల వివరాలు, అర్హత మరియు దరఖాస్తు ఫారం ఇతర వివరాలకు www.tirumala.org / www.tirupati.org టిటిడి వెబ్‌సైట్‌లను సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.