ADVANCEMENT OF TTD EDUCATIONAL INSTITUTIONS LAUDABLE- THIRD ADDITIONAL DISTRICT JUDGE SRI VEERAJU

SUPPORT RIGHTS OF CHALLENGED PERSONS

Tirupati, 03 December 2022: Third Additional District Judge Justice Sri Veeraju on Saturday called for the protection of the rights and privileges of specially able persons.

Participating as Chief Guest in the international challenged persons day celebrations at the TTD-run Sri Venkateswara Deaf & Dumb college in Tirupati on Saturday evening, Justice Veeraju lauded the evolution of TTD educational institutions and complimented students for the divine opportunity to study in such institutions with the benign blessings of Sri Venkateswara.

He said teachers of such institutions should guide students in right path and lauded TTD JEO for Education and Health Smt Sada Bhargavi in leading the institutions to greater heights.

TTD JEO said TTD had plans to provide degree courses to challenged persons. During the Entire of December month, TTD focused on awareness campaign on challenged persons and training activities

Principal Senior Judge Srinivasa Rao, TTD Assistant  Law officer Sri Yugandhar Reddy, TTD DEO Sri Bhaskar Reddy, SVETA Director Smt Prashanti, SV D&D college principal Sri Venkata Ramana Murthy were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

వికలాంగుల హక్కుల సాధనకు సహకారం అందించాలి

– టీటీడీ విద్యాసంస్థల అభివృద్ధి అభినందనీయం

మూడవ అదనపు జిల్లా జడ్జి శ్రీ వీర్రాజు

తిరుపతి 3 డిసెంబరు 2022: ప్రత్యేక ప్రతిభావంతులు (వికలాంగుల) పట్ల సమాజం జాలి, దయ చూపకుండా వారి హక్కుల సాధనకు సహకారం అందించాలని మూడవ అదనపు జిల్లా జడ్జి శ్రీ వీర్రాజు అన్నారు.

శ్రీ వేంకటేశ్వర బధిరుల కళాశాలలో శనివారం రాత్రి నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వేడుకల్లో శ్రీ వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను తొలిసారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల వల్లే టీటీడీ విద్యా సంస్థల్లో చదువు కునే అవకాశం విద్యార్థులకు లభించిందన్నారు. ఉపాద్యాయులు వీరి భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దదానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఇలా ముందుకు సాగినప్పుడే దేవుడు తన సహాయం అందిస్తారని ఆయన ఉద్భోదించారు. సమాజంలో తాము ఎవరికంటే తక్కువ కాదనే భావన వికలాంగుల్లో పెంపొందించాలన్నారు. తమ హక్కుల సాధన కోసం న్యాయస్థానాల ద్వారా వీరు సహాయం పొందవచ్చునని శ్రీ వీర్రాజు వివరించారు. ఇక్కడ చదువు కున్న విద్యార్థులు సంస్థ పేరు నిలబెట్టేలా ఎదగడమే స్వామికి మీరిచ్చే కానుక అన్నారు. జేఈవో శ్రీమతి సదా భార్గవి నేతృత్వంలో టీటీడీ విద్యా సంస్థలు ఎంతో పురోగతి సాధిస్తున్నాయని అభినందించారు.

టీటీడీ జేఈవో శ్రీమతి సదాభార్గవి మాట్లాడుతూ, బధిర కళాశాల విద్యార్థులకు డిగ్రీ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి స్థానాల్లో నిలబడి దేవస్థానానికి మంచిపేరు తేవాలని కోరారు. బధిర కళాశాల, పాఠశాల అభివృద్ధి కోసం టీటీడీ ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు. తన బృందం ఉమ్మడి కృషితోనే టీటీడీ విద్యా సంస్థల అభివృద్ధి సాధ్యం అవుతోందని ఆమె అన్నారు. డిసెంబరు నెల మొత్తం వికలాంగుల అవగాహన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదువు తున్న విద్యార్థులు సంస్థ గౌరవం పెంచేలా నడుచుచుకోవడమే దేవుడి కిచ్చే బహుమానమని శ్రీమతి సదా భార్గవి చెప్పారు.

ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వికలాంగుల హక్కుల సాధన కోసం చట్టాలు ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం కోర్టులు వారిని సహకరిస్తాయని చెప్పారు.

టీటీడీ అసిస్టెంట్ లా ఆఫీసర్ శ్రీ యుగంధర్ రెడ్డి, టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు అధ్యక్షులు శ్రీ చీర్ల కిరణ్ ప్రసంగించారు. డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వెంకట రమణ.మూర్తి పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులుబహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది