AFFILIATION OF VEDA PATHASHALAS ACROSS INDIA WITH VEDIC UNIVERSITY -TTD EO _ దేశంలోని వేద పాఠశాలల‌న్నీ వేద విశ్వవిద్యాలయంతో అనుసంధానం – స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో వేద విశ్వ‌విద్యాల‌యం విసి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

దేశంలోని వేద పాఠశాలల‌న్నీ వేద విశ్వవిద్యాలయంతో అనుసంధానం

– స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో వేద విశ్వ‌విద్యాల‌యం విసి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

 తిరుప‌తి, 2022 ఆగ‌స్టు 15: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయ కులపతి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయ‌న మాట్లాడుతూ, ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింద‌ని, వారి త్యాగ ఫలితమే ఈనాటి అమృతోత్సవం అన్నారు. ఆ స్పూర్తితో వేద విశ్వవిద్యాలయ ఉన్నతికి అహర్నిశలూ కృషి చేయాలని, వేద విద్య పరిరక్షణ మనందరి బాధ్యతన్నారు. దేశంలో ఉన్న అన్ని వేద పాఠశాలలను ఏకీకృతం చేసి వేద విశ్వవిద్యాలయంతో అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.

వేద విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు ఉచితంగా క‌ల్పిస్తున్నామ‌ని, బాగా చదువుకుని విజ్ఞానవంతులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. 2009 నుండి ఉన్న అడహాక్ లెక్చరర్ల సమస్యను ప‌రిష్క‌రించి, వారిని పర్మినెంట్ చేశామని 2009 నుండి వారి సర్వీసులు గుర్తిస్తున్నామని, అధ్యాపకులు బోధన-పరిశోధన అంశాలలో రాజీ పడకుండా కృషి చేయాల‌న్నారు. ఈ సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ పటిష్ఠంగా నిర్మించామని దానిని అనుసరించి అకడమిక్ వ్యవస్థను పటిష్ఠంగా నడపాలన్నారు.

అధ్యాపకులు, విద్యార్థులకు ఉపన్యాస కౌశలాన్ని పెంపొందించేందుకు శ్రుతసంవర్ధిని, గవేషణ మొదలైన సభలను విశ్వవిద్యాలయం నిర్వహిస్తుందని, దీని ద్వారా విద్యార్థులు అధ్యాపకులు చక్కని ఉపన్యాసకులుగా త‌యార‌వుతార‌ని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ధనంజయ ద్వివేది, గురు ప్రసాద్, రోషన్ పాఠక్, ధీరజ్ దేశ భక్తి గీతాల‌ను ఆల‌పించారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా.ఎవి.రాధేశ్యామ్, అకడమిక్ డీన్ డా.ఫణియజ్ఞేశ్వర యాజులు, సంచాలకులు డా.సీతారామారావు, శ్రీ రామకృష్ణ, పిఆర్వో డా. బ్రహ్మచార్యులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

·      EO PARTICIPATES IN I-DAY CELEBRATIONS IN THE VARSITY

Tirupati, 15 August 2022: TTD EO Sri AV Dharma Reddy said that TTD had commenced a process for merger and affiliation of all Veda Pathashalas across the country with Vedic University.

He unfurled the Tricolour National Flag in the capacity of the Vice Chancellor of Sri Venkateswara Vedic University along with others.

Addressing the occasion, he appealed to the Vedic faculty and students to draw inspiration from freedom fighters who sacrificed their lives for the sake of Independent India. Promotion of Vedic studies and development of the Vedic University should be your priority.

He said TTD provided all basic facilities for Veda students and exhorted them to acquire ancient knowledge. The faculty of the University should not compromise on quality of education as TTD had resolved the issue of adhoc lecturers in 2009 recognising their services and making them permanent.

He urged the staff to follow the academic system to achieve good results and said the University has been organizing conferences like Shruta samvardhini and Gaveshana for the benefit of the faculty and students to sharpen their communication skills.

Thereafter students Dhananjay Dwivedi, Guru Prasad, Roshan Pathak and Dheeraj presented patriotic songs on the auspicious occasion of 75 glorious years of Azadi ka Amrit Mahotsav.

Registrar of University Dr AV Radhesyam, Academic Dean Dr Phaniyajneswar Yajulu, Directors Dr Sitarama Rao, Sri Ramakrishna, PRO Dr Bhrahmacharyulu, faculty and students were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI