DEVOTEES ARE OUR DEITIES -TTD EO _ భక్తులే మ‌న‌ దేవతలు -టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

TIRUMALA, 15 AUGUST 2022: Paying tributes to the Freedom Fighters who sacrificed their lives for Independent India on the occasion of 76th Independence Day Celebrations, TTD EO Sri AV Dharma Reddy said, TTD employees also serve the pilgrims with dedication as ”Devotees are our Deities “.

 

During his I-Day speech after hoisting the National Flag at Gokulam Rest House premises on Monday, the TTD poured in laurels on TTD officials, employees of various departments, Vigilance and Police for their dedicated services from the past five months as Tirumala has been witnessing heavy rush in the aftermath of post Covid.

 

“Since this April, Tirumala has been witnessing unprecedented pilgrim crowd as the Central and State Governments have relaxed Covid norms. The services by Annaprasadam, Health, Vigilance, Kalyana Katta, Reception and temple wings are exceptionally well as all the employees are discharging duties round the clock, during rush period which is still continuing”, he observed. He also thanked media for spreading the Glory of Srivaru and the pilgrim-friendly development activities taken up by TTD across the country.

 

“If we take a glance at the development activities that took place in Tirumala in the last one year, all the rest houses which were built some four decades ago are being given a facelift and more convenient for devotees. Out of the 7000 rest houses already 5000 were equipped even with Hot water geysers while the remaining will get ready by the September”.

 

Adding further he said “Even the modernised Parakamani Building will be ready for inauguration scheduled on September 28 at Tirumala. Similarly the TATAs has come forward to revive the SV Museum in the Hill Town with international standards. The jewels of Tirumala temple and artefacts will be digitized and put on display with 3D imaging technology for the sake of the devotees”, he said.

 

The EO said TTD observing the Azadi ka Amrit Mahotsav in a big way celebrating the 75 glorious years of Independent India and wished all the strong workforce of TTD to continue their services with the same spirit and offer impeccable services to devotees.

 

SE2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, VGO Sri Bali Reddy, EEs, DyEOs, AVSOs and other officials were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

భక్తులే మ‌న‌ దేవతలు -టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2022 ఆగ‌స్టు 15: భక్తులే మా ఆరాధ్యదైవం అంటూ టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో యాత్రికులకు సేవలందించాల‌ని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అన్నారు. తిరుమ‌ల గోకులం విశ్రాంతి గృహం ఆవరణలో సోమవారం ఉద‌యం ఈవో జాతీయ జెండాను ఎగురవేశారు.

అనంతరం ఈవో అధికారులు, ఉద్యోగులను ఉద్ధేశించి ప్రసంగిస్తూ, స్వాతంత్య్ర భారతం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించారు. కోవిడ్ అనంతరం తిరుమలలో భారీ రద్దీ నేప‌థ్యంలో గత ఐదు నెలలుగా అంకితభావంతో సేవలందించిన టీటీడీ అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, విజిలెన్స్, పోలీసు సిబ్బందిని ఆయ‌న‌ ప్రశంసించారు.

“ఈ ఏప్రిల్ నుండి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలను సడలించడంతో తిరుమలలో యాత్రికుల రద్దీ అధికంగా ఉంద‌న్నారు. అన్నప్రసాదం, ఆరోగ్యం, విజిలెన్స్, కల్యాణ కట్ట, రిసెప్షన్ మరియు ఆలయ విభాగాల ఉద్యోగులు అద్భుతంగా సేవలు అందిస్తున్నార‌ని చెప్పారు. అధిక రద్దీ ఇప్పటికీ కొనసాగుతోంది,” అని అన్నారు. శ్రీవారి వైభవాన్ని, యాత్రికుల సౌక‌ర్యార్థం టీటీడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

తిరుమలలో గత ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కసారి పరిశీలిస్తే నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన విశ్రాంతి గృహాలన్నీ భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఆధునీక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. 7 వేల విశ్రాంతి గృహాలలో ఇప్పటికే 5 వేల గ‌దుల‌లో వేడి నీటి గీజర్ల అమర్చిన‌ట్లు, మిగిలినవి సెప్టెంబర్ నాటికి సిద్ధం చేయ‌నున్న‌ట్లు చెప్పారు “.

నూత‌నంగా నిర్మించిన‌ పరకామణి భవనం కూడా సెప్టెంబరు 28న తిరుమలలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని తెలిపారు. అదేవిధంగా తిరుమ‌ల‌లో ఎస్వీ మ్యూజియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్ధిదేందుకు టాటా ట్ర‌స్టు ముందుకు వచ్చిందన్నారు. తిరుమల ఆలయంలోని ఆభరణాలు, కళాఖండాలు భక్తుల కోసం 3డి ఇమేజింగ్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేసి ప్రదర్శనకు ఉంచ‌నున్న‌ట్లు ’’ ఈవో తెలిపారు.

భారతదేశం 75 స్వాతంత్య్ర సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భ‌న్ని పురస్కరించుకుని టీటీడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. టీటీడీ ఉద్యోగులందరూ ఇదే స్ఫూర్తితో తమ సేవలను కొనసాగించి భక్తులకు మ‌రింత ఉన్న‌తంగా సేవలను అందించాలని ఈవో ఆకాంక్షించారు.

ఎస్‌ఈ – 2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఈఈలు, డెప్యూటీ ఈవోలు, ఏవీఎస్‌ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.