AGED AND PHC DARSHAN ON JAN 29, PARENTS WITH INFANTS ON JAN 30_ జనవరి 29న వృద్ధులు, దివ్యాంగులకు, జనవరి 30న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Tirumala, 28 January 2018: TTD will issue 4000 darshan tokens to aged people (65y and above) and on January 29 and allow parents with children below 5years on January 30 from 9am to 1:30pm.

It may be mentioned here that TTD has been allowing the above categories of darshan on any two lean days in a year.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జనవరి 29న వృద్ధులు, దివ్యాంగులకు, జనవరి 30న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

తిరుమల, 2018 జనవరి 28: ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.

ఇందులో భాగంగా జనవరి 29వ తేదీన వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టిటిడి అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను జనవరి 30వ తేదీన ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.