AKASAGANGA SRI BALANJANEYASWAMY TEMPLE FETE CONCLUDED _ ఆకాశ‌గంగా శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో శాస్త్రక్తంగా సింధూరార్చన

Tirumala, 06 May 2024: As part of the Hanumath Jayanti celebrations in Tirumala, the Sindhura archana, which is very dear to the Lord Hanuman, was performed by the priests on Wednesday at the Sri Balanjaneyaswamy temple along with Sri Anjanadevi in ​​Akashaganga, the birth place of Sri Anjaneyaswamy.  

Later, Pushpa and Tulsi Archana was performed to Sri Ramachandra Murthy and Sri Balanjaneya Swamy.

On this occasion, TTD Vaikhanasa Agama advisor Sri Mohan Rangacharyulu explained that those who wear Sindhur will get long life, Ashtaiswarya and glory.

Later, the priests performed Panchamrita Snapana Tirumanjanam to Balanjaneya Swamy and Sri Sudarshan Chakram.

TTD officials and temple priests participated in these programs.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆకాశ‌గంగా శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో శాస్త్రక్తంగా సింధూరార్చన

తిరుమ‌ల‌, 2024 జూన్ 05: తిరుమ‌ల‌లో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థ‌ల‌మైన ఆకాశ‌గంగ‌లో శ్రీ అంజ‌నాదేవి స‌మేత శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో బుధవారం ఉద‌యం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్ర‌మైన‌ సింధూరార్చన అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తికి, శ్రీ బాలాంజనేయ స్వామి వారికి పుష్ప, తులసి అర్చన జరిగింది.

ఈ సందర్భంగా టీటీడీ వైఖాన‌స ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ మోహ‌న‌రంగాచార్యులు సింధూరం ధరించిన వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కీర్తి గడిస్తారని, సింధూరార్చన విశిష్టత, హనుమత్ వైభవము, అంజనాద్రి పర్వతం గురించి వివరించారు. అనంతరం బాలాంజనేయ స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రానికి పంచామృత స్న‌ప‌న తిరుమంజ‌నం ఆలయ అర్చకులు శాస్త్రక్తంగా నిర్వహించారు..

ఈ కార్య‌క్ర‌మాల్లో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.