AKHANDA BALAKANDA PARAYANAM ON JUNE 10 _ జూన్ 10న 9వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

TIRUMALA, 08 JUNE 2022: The ninth edition of Akhanda Balakanda Parayanam will be observed at Nada Neerajanam in Tirumala on June 10 between 6:30am and 8:30am.

 

A total of 172 shlokas from Chapters 38-43 will be recited by Vedic scholars, faculty of all TTD Vedic institutions, National Sanskrit Varsity, devotees which will be telecasted live on SVBC for the sake of global devotees.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 10న 9వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

తిరుమల, 2022 జూన్ 08: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జూన్ 10వ తేదీన శుక్ర‌వారం 9వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

బాలకాండలోని 38 నుండి 43 సర్గల వ‌ర‌కు గ‌ల 172 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్,  జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.