AP GUV OFFERS PRAYERS _ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌

TIRUMALA, 08 JUNE 2022: The Honourable Governor of Andhra Pradesh Sri Biswabhushan Harichandan offered prayers along with his family at Tirumala temple on Wednesday.

 

Earlier on his arrival at Mahadwaram, he was offered a traditional Isthikaphal welcome by pundits and received by TTD EO Sri AV Dharma Reddy to the temple.

 

After darshan of Srivaru, he was rendered Vedaseervachanam at Ranganayakula Mandapam and presented with Swamivari Theertha Prasadams.

 

Among others, Additional CVSO Sri Siva Kumar Reddy, Deputy EOs Sri Ramesh Babu, Sri Harindranath, were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌

తిరుమ‌ల‌, 2022 జూన్ 08: రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గౌ.శ్రీ. బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం మ‌ధ్యాహ్నం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ మ‌హ‌ద్వారం వద్ద ఆలయ అర్చకులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆల‌యంలోకి ఆహ్వానించారు.

స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈవో శ్రీ‌వారి తీర్థప్రసాదాలను గౌ. గ‌వ‌ర్న‌ర్‌కు అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్ బాబు, శ్రీ హ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.