AKHANDA HARINAMA SANKEERTANA IN TIRUMALA TO RESUME FROM AUGUST 1-TTD EO _ వకుళమాత ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం : టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

GREENERY AND LANDSCAPES TO BE DEVELOPED AT VAKULAMATA TEMPLE

TIRUMALA, 09 JULY 2022:  The Akhanda Harinama Sankeertana by folk artists hailing from different places of the Southern states which was stalled during the Covid period will be resumed from August 1 onwards at the Akhanda Bhajana Mandiram located adjacent to main Kalyanakatta at Tirumala, said TTD EO Sri AV Dharma Reddy.

After the Dial your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Saturday, in media briefing the EO said, landscapes and greenery will be developed at Sri Vakulamata Temple which was opened for from June 23 onwards near Patakalva at Tirupati.

He also said, the SV Museum in Tirumala is soon to get a facelift with state of art international standard facilities to allure visiting pilgrims.

On Angapradakshinam tokens, the EO said upon the request of the local devotees, a percentage of tokens will be allotted in offline at Tirumala while remaining in online of the total quota of 750 tokens per day.

Later giving the June month statistics about pilgrims and other details, the EO said 23.23 lakh devotees have availed darshan while the Hundi collections stood at ₹123.74 crore. About 95.34 lakhs laddus were sold, 50.61lakh devotees were served Annaprasadams, 11.61 lakh devotees offered hair in Kalyanankattas as a fulfilment of their wishes.

TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CEO SVBC Sri Shanmukh Kumar, VGO Sri Bali Reddy and other HoDs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వకుళమాత ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం : టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2022 జులై 09: పాతకాల్వ పేరూరు బండపై గల వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఈఓ సమాధానాలిచ్చారు.

వకుళమాత ఆలయం చుట్టూ పేరూరు బండపై భక్తులకు ఆహ్లాదం కలిగించేలా పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. అంగప్రదక్షిణ టోకన్లు రోజుకు 750 చొప్పున ఆన్లైన్లో విడుదల చేస్తున్నామని, అయితే సుమారు 400 టికెట్ల వరకు మిగిలిపోతున్నాయని తెలిపారు. బుక్ చేసుకున్న భక్తుల్లో కొంత మంది రాలేక పోతున్నారని చెప్పారు. స్థానిక భక్తుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్లో మిగిలిపోయిన టికెట్లను ఆఫ్ లైన్లో కేటాయిస్తామని తెలిపారు.

తిరుపతిలో శ్రీనివాస సేతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ నాటికి కరకంబాడి వైపు నుంచి వచ్చే మార్గంలో లీలామహల్ వద్ద వారధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని, డిసెంబర్ నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని తెలియజేశారు. ఎస్వీ మ్యూజియాన్ని దాతల సహకారంతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వసతులతో త్వరలో పూర్తి చేస్తామన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.