AKHANDA MAHAYAGNAM OF ANNAMAYYA SANKEERTANS _ జనవరి 22, 23వ తేదీల్లో ”అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం”

Tirupati, 21 January 2024: Akhanda Mahayagnam program of Annamaiah Sankeertan will be held on January 22nd and 23rd at Annamacharya Kalamandiram in Tirupati.  This program will be held under the auspices of the TTD Annamacharya Project on the occasion of the inauguration of Sri Rama Mandir in Ayodhya.

 

On Monday, January 22, at 9 am, the Annamayya Utsava idol procession will begin from the TTD administration building.  Artists sing Sankeertans and take a procession through the streets of Sri Kodandaramalaya temple to the Annamacharya Kalamandiram.  From 11 am to 11 am the next day, the Sankeertans will be rendered continuously by the artists for 24 hours.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జనవరి 22, 23వ తేదీల్లో ”అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం”

తిరుప‌తి, 2024 జనవరి 21: తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జనవరి 22, 23వ తేదీల్లో అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం కార్య‌క్ర‌మం నిర్వహించనున్నారు. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది.

జనవరి 22న సోమ‌వారం ఉదయం 9 గంట‌ల‌కు టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నం నుండి అన్న‌మ‌య్య ఉత్స‌వ విగ్ర‌హం ఊరేగింపు మొద‌ల‌వుతుంది. క‌ళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయ మాడ వీధుల గుండా అన్నమాచార్య కళామందిరానికి తీసుకెళ‌తారు. ఉదయం 11 గంటల నుండి మ‌రుస‌టిరోజైన మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటల వ‌ర‌కు, 24 గంట‌ల పాటు నిరంతరాయంగా క‌ళాకారులు సంకీర్తనలను ఆలపిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.