LIVE TELECAST OF AYODHYA RAM MANDIRAM PRANA PRATISTA ON SVBC _ జ‌న‌వ‌రి 22న ఎస్వీబీసీలో అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం

Tirumala, 21 January 2024: The consecration ceremony of Ram Mandiram in Ayodhya is slated to be held on between 11:30 am and 12.30 pm on January 22. 

 

On this occasion, Sri Venkateswara Bhakti Channel under the auspices of TTD will telecast the Vedic and spiritual rituals in the Ayodhya temple in its Tamil, Kannada and Hindi channels and also in SVBC Telugu YouTube channel.

 

The consecration ceremony events in Ayodhya will be telecasted live on SVBC Telugu channel till 12 noon.  After that, Tirumala Srivari Kalyanam will be telecasted live as usual from 12 noon. 

 

After that the Kalyanam, the programs in Ayodhya will continue.

 

TTD appeals to the devotees to observe these things and watch the Ayodhya Prana Pratista ceremony on SVBC Telugu, Tamil, Kannada and Hindi channels and beget the divine blessings.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జ‌న‌వ‌రి 22న ఎస్వీబీసీలో అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం

తిరుమల, 21 జ‌న‌వ‌రి, 2024: అయోధ్య శ్రీరామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జ‌న‌వ‌రి 22వ తేదీ ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛాన‌ల్ తమిళం, కన్నడ, హిందీ ఛాన‌ళ్లలో, అదేవిధంగా ఎస్వీబీసీ తెలుగు యూట్యూబ్ ఛాన‌ల్‌ ద్వారా అయోధ్యలో జరిగే వైదిక, ఆధ్యాత్మిక క్రతువులను నిరంతరాయంగా ప్రత్యక్షప్రసారం చేయనుంది.

ఎస్వీబీసీ తెలుగు ఛాన‌ల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు అయోధ్య కార్యక్రమాలు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అనంతరం 12 గంటల నుండి తిరుమల శ్రీవారి కల్యాణం యధావిధిగా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఆ తరువాత అయోధ్యలో మధాహ్నం 12 గంటల నుండి జ‌రిగే కార్యక్రమాలను శ్రీ‌వారి క‌ల్యాణం అనంత‌రం తిరిగి ప్ర‌సారం చేస్తారు.

భక్తులు ఈ విషయాలను గమనించి ఎంతో వైభవంగా, ఆగమోక్తంగా జరిగే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛాన‌ళ్లలో వీక్షించి తరించాలని భక్తలోకానికి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.