AKHILA BHARATA BHAGAVAD SHASTRA VIDWAT SAMMELAN OF PANCHARATRA AGAMA FROM DECEMBER 1-3 _ డిసెంబ‌రు 1 నుండి 3వ తేదీ వ‌ర‌కు అఖిల భార‌త భ‌గ‌వ‌త్‌శాస్త్ర పాంచ‌రాత్ర ఆగ‌మ విద్వ‌త్ స‌మ్మేళ‌నం

Tirupati,29 November 2023:   TTD is organising a three-day conference  on  Pancharatra agama at the Asthana Mandapam of Sri Padmavati temple, Tiruchanoor from December 1-3 

The eminent scholars from AP, Telangana, Tamilnadu, Karnataka, Puducherry will participate in the conference hosted jointly by the Akhila Bharata Bhagavad Shastra Vidwat Sammelan along with the Divya Prabandha Project of TTD.

The theme concept of the sammelan of the erudite pundits is focussed on the puja process, Natya, Shilpa, Vaidya, Jyotishya which form the foundation of Pancharatra Agama. The conference is also expected to highlight the issues of temple building and renovations and to find Vedic solutions to burning current topics and future problems.

As a part of the program, sessions will be held from morning 9am and 6 pm and Sri K Rajagopal Rao, Program Officer of TTD Dharmic Projects is supervising all arrangements and programs of the conference.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబ‌రు 1 నుండి 3వ తేదీ వ‌ర‌కు అఖిల భార‌త భ‌గ‌వ‌త్‌శాస్త్ర పాంచ‌రాత్ర ఆగ‌మ విద్వ‌త్ స‌మ్మేళ‌నం

తిరుపతి, 29 నవంబరు 2023: టీటీడీ ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు, భ‌గ‌వ‌త్‌శాస్త్ర పాంచ‌రాత్ర ఆగ‌మ సంర‌క్ష‌ణ స‌భ సంయుక్త ఆధ్వ‌ర్యంలో డిసెంబ‌రు 1 నుండి 3వ తేదీ వ‌ర‌కు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్ద‌గ‌ల ఆస్థాన‌మండ‌పంలో అఖిల భార‌త భ‌గ‌వ‌త్‌శాస్త్ర పాంచ‌రాత్ర ఆగ‌మ విద్వ‌త్ స‌మ్మేళ‌నం జ‌రుగ‌నుంది.

ఆల‌య పూజావిధుల‌తోపాటు నాట్య‌, శిల్ప‌, వైద్య‌, జ్యోతిష‌, ప‌లు లౌకిక విష‌యాలను శ్రీ పాంచ‌రాత్ర ఆగ‌మం తెలియ‌జేస్తోంది. దేవాల‌య నిర్మాణం, దేవాల‌య పున‌ర్నిర్మాణం ఇత‌ర వ‌ర్త‌మాన, భ‌విష్య‌త్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం శ్రీ పాంచ‌రాత్ర ఆగ‌మాన్ని మార్గ‌ద‌ర్శ‌కంగా భావించేలా చేయ‌డ‌మే ఈ స‌ద‌స్సు ముఖ్య ఉద్దేశం.

ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మూడు రోజుల పాటు ఉద‌యం 9 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు స‌ద‌స్సులు నిర్వ‌హిస్తారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, పాండిచ్చేరి నుండి ప్ర‌ముఖ పండితులు విచ్చేసి ప్ర‌సంగిస్తారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి శ్రీ కె.రాజ‌గోపాల్‌రావు ఈ స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.