ALL ARRANGEMENTS IN PLACE FOR PREZ VISIT-TTD CHAIRMAN _ భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ తిరుమల పర్యటన ఏర్పాట్లను ప‌రిశీలించిన టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirumala, 23 Nov. 20: All the arrangements are in place for the scheduled visit of Honourable President of India, Sri Ramnath Kovind on November 24 to Tirumala, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

Speaking to media persons after inspecting the arrangements at Sri Padmavathi Rest House, Rambhageecha, Varaha Swamy and Srivari temples along with TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, he said, as the visit of the first citizen of the country is scheduled in the present Covid conditions, there is every restriction in the deployment of personnel everywhere, he added.

He said, the District Collector, Sri Bharat Narayan Gupta, SP Sri Ramesh Reddy are making security arrangements in coordination with CVSO Sri Gopinath Jatti.

CE Sri Ramesh Reddy, EE Sri Jaganmohan Reddy, temple DyEO Sri Harindranath, VGO Sri Bali Reddy, AVSO Sri Gangaraju, Temple Peishkar Sri Jaganmohanachary and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ తిరుమల పర్యటన ఏర్పాట్లను ప‌రిశీలించిన టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమల, 2020 న‌వంబ‌రు 23: భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ నవంబర్ 24న మంగ‌ళ‌వారం తిరుమల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్త‌వుతున్నాయని టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో ఛైర్మ‌న్, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి సోమ‌వారం ఏర్పాట్లను ప‌రిశీలించారు.  

ఇందులో భాగంగా తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, రాంభగీచ వ‌స‌తి భ‌వ‌నాలు, శ్రీ వరాహ స్వామి ఆల‌యం, శ్రీవారి ఆలయాలలో ఏర్పాట్లను పరిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.  

అనంత‌రం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ గౌ|| రాష్ట్రపతి  శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌స్తున్నందున  కోవిడ్ – 19 పరిస్థితుల దృష్ఠ్యా ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రపతి ప‌ర్య‌టించే ప్రాంతాల‌లో ప్రతిచోటా ప‌‌రిమిత సంఖ్య‌లో సిబ్బందిని నియ‌మించిన‌ట్లు తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బందికి ముంద‌స్తుగా కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు.  సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ శ్రీ భ‌రత్‌ నారాయణ్ గుప్త‌, ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డిలు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలియ‌జేశారు.

సిఇ శ్రీ రమేష్ రెడ్డి, ఇఇ శ్రీ జగన్మోహన్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, విజిఓ శ్రీ బాలి రెడ్డి, ఎవిఎస్వో శ్రీ గంగరాజు, టెంపుల్ పేష్కర్ శ్రీ జగన్మోహనాచారి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.