ALL SET FOR BRAHMOTSAVAM- TTD EO_ భక్తులకు సంతృప్తికరంగా శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవల దర్శన ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
CM WILL PRESENT SILK VASTRAMS IN SRIVARI TEMPLE BTN. 7:30pm AND 8:30pm
TTD TELUGU WEBSITE, 2018 TTD CALENDAR AND DIARY TO BE RELEASED
Tirumala,22 September 2017: The temple management of Tirumala Tirupati Devasthanams, TTD is fully geared up to host the nine day mega religious festival of Tirumala Brahmotsavams, asserted TTD Executive Officer Sri Anil Kimar Singhal.
Addressing the a pre-Brahmotsavam media conference at the Annamaiah Bhavan in Tirumala on Friday the EO said, TTD is set ready to receive devotees from all over country for the celestial festival and provide them hassle-free, comfortable darshan and stay besides a memorable spiritual experience.
Sri Singhal said all efforts would be made to  provide Moola Virat darshan inside temple as well grand spectacle of Vahana seva on the Mada streets to all devotees. ‘We have put up  30 large digital screens ( 19  on the Mada streets and 11 outside) for the celestial event and also a live HD coverage by the SVBC for benefit of all those at Mada street galleries, else where in Tirumala and globally’, he added.
Nearly 7000 parking lots have been geared up for 4 Wheeler in Tirumala besides 2500 more near Alipiri as contingency. Ghat roads and the Alipiri footpath route will be open through the night  during Brahmotsavam while the Srivarimettu footpath will be open all though the night only on Garuda seva day. In view of anticipated pilgrim influx during Peratasi Saturdays, TTD has cancelled Divya Darshan tokens on September 23, 27 (Garuda Seva) and 30. TTD has also reduced  advance booking of rooms and Rs.300 Darshan tickets. Even the there is cut in the advance booking of cottages by donors”, EO said.
On security front the EO said 640 CC cameras, Child tags, Body cameras and also other digital apps to make Tirumala safe and secure for devotees have been deployed this year apart from security cover with  2000 vigilance staff, 2700 police, 3000 Srivari Sevakulu and 1000 scouts and guides. ‘We have earmarked  five entry and exit points on Mada Street  for evacuation of devotees after Garuda seva darshan ‘, the EO maintained.
He said the galleries of Mada street with capacity of 1. 8 lakh capacity will be fully sanitized and all devotees will be provided food, water, butter milk throughout day at their seating places. ‘All junctions and locations of Tirumala are decked up with flowers and huge electrical illuminations to inspire bhakti elixir among devotees’, he said .
The EO said sufficient buffer stock of laddu is available to ensure that no devotees could go home unhappy without laddu prasadams. The Annaprasadam points have been put up all over Tirumala so that devotees who can not go to Anna prasadams complex enjoy Anna prasadams at bus stand,CRO, Kalyanakatta and also in the queue lines outside temple and the Vaikuntam complex. The cultural programmes have also be organised with eminent persons at Nada Neerajanam, in front of Vahanam procession,  Asthana Mandapam and at Mahati in Tirupati for Brahmotsavams. I appreciate the team efforts of all our departments who have been working day and night for the big event”, the complimented.
Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri A Ravikrishna were also present.
ISSUED BY PUBLIC RELATIONSOFFICER, TTDs, TIRUPATI
భక్తులకు సంతృప్తికరంగా శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవల దర్శన ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
సెప్టెంబర్ 22, తిరుమల 2017: శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులు సంతృప్తికరంగా స్వామివారి మూలమూర్తితో పాటు వాహనసేవలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లపై తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది బాగా శ్రమించి ఏర్పాట్లు చేపట్టారని, బ్రహ్మూెత్సవాల్లో రోజుల్లో మరింత అంకితభావంతో భక్తులకు సేవలందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
సెప్టెంబరు 23న రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణ :
శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో మొదటిరోజైన సెప్టెంబరు 23న ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. శనివారం రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రి చేతులమీదుగా 2018వ సంవత్సరం టిటిడి డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.
బ్రహ్మూెత్సవాల్లో ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ఆర్జితసేవలతోపాటు వయోవ ద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. పెరటాసి మాసం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 23, 27(గరుడసేవ), 30వ తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు జారీ ఉండదని చెప్పారు. ఆన్‌లైన్‌లో గదుల ముందస్తు బుకింగ్ కోటాను 2 వేల నుంచి వెయ్యికి తగ్గించామని, ప్రతిరోజూ 4 వేల గదులు సాధారణ భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామన్నారు. మాడ వీధుల్లో గ్యాలరీల్లో 1.80 లక్షల మంది భక్తులు వాహనసేవలు వీక్షించేందుకు అవకాశముందని, గరుడసేవ నాడు మరో 70 వేల మంది భక్తులు గ్యాలరీల బయట ఉంటారని, వీరందరి కోసం మాడ వీధుల్లో 19, ఇతర ప్రాంతాల్లో 11 కలిపి మొత్తం 30 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విచ్చేసే భక్తులందరికీ అన్నప్రసాదాలు, తాగునీరు, చంటిపిల్లలకు పాలు అందిస్తామన్నారు.
గరుడసేవనాడు ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేధించామని, తిరుమలకు 7 వేల నాలుగు చక్రాల వాహనాలను అనుమతిస్తామని, ఆ తరువాత వచ్చే వాహనాల కోసం తిరుపతిలో పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టామని ఈవో తెలిపారు. ఆర్‌టిసి బస్సులు 4 వేల ట్రిప్పులు తిరిగి భక్తులను చేరవేస్తాయన్నారు. బ్రహ్మూెత్సవాల రోజుల్లో 24 గంటల పాటు ఘాట్ రోడ్లు, అలిపిరి కాలిబాట మార్గం తెరిచి ఉంటాయన్నారు. గరుడ సేవనాడు శ్రీవారి మెట్టు మార్గాన్ని 24 గంటల పాటు తెరిచి ఉంచుతామన్నారు. శ్రీవారి ఆలయంతోపాటు ఇతర ప్రాంతాల్లో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టినట్టు చెప్పారు. పరిశుభ్రతకు పెద్దపీట వేశామని, ఆలయ నాలుగు మాడవీధులతోపాటు కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం అదనపు సిబ్బంది ఏర్పాటుచేశామని వెల్లడించారు. ఫలపుష్ప, ఫొటో, మ్యూజియం ఎగ్జిబిషన్లను భక్తులు తిలకించాలని కోరారు. 3 వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యి మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారని తెలిపారు. తిరుమలకు రాలేని భక్తులు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా బ్రహ్మూెత్సవాల వైభవాన్ని తిలకించాలని కోరారు. వాహనసేవల ఎదుట, తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై ఆకట్టుకునేలా ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామన్నారు.
భక్తుల సౌకర్యార్థం ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు : జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
శ్రీవారి వాహనసేవలు తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల్లోని పలు ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు ఏర్పాటు చేసినట్టు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. ప్రధాన కల్యాణకట్ట వద్ద గల గేట్, అన్నప్రసాద భవనం వద్ద గల గేటు ద్వారా తూర్పు మాడ వీధిలోకి, మ్యూజియం ఎదురుగా గల గేటు ద్వారా పడమర, దక్షిణ మాడ వీధుల్లోకి, ఎన్4 గేటు, వరాహస్వామి విశ్రాంతి గృహం పక్క మార్గం ద్వారా ఉత్తర మాడ వీధిలోకి భక్తులు ప్రవేశించవచ్చన్నారు. అదేవిధంగా, తూర్పు, దక్షిణ మాడ వీధుల్లోని భక్తులు ఆస్థానమండపం వద్దగల గేట్లు, రాంభగీచా గేటు ద్వారా, పడమర మాడవీధిలోని భక్తులు గోవిందనిలయం పక్కన గల డబ్ల్యు4 గేటు ద్వారా, ఉత్తర మాడ వీధిలోని భక్తులు ఎన్7 గేటు నుంచి వెలుపలికి వెళ్లవచ్చని వివరించారు.
సిసిటివిల ద్వారా భక్తుల భద్రత పర్యవేక్షణ : సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ
తిరుమలలోని శ్రీవారి ఆలయం, మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం 640 సిసిటివిలు ఉన్నాయని, బ్రహ్మూెత్సవాల కోసం అదనంగా 70 సిసిటివిలు ఏర్పాటుచేశామని సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయా ప్రాంతాల్లోని సిసిటివిల ద్వారా భక్తుల భద్రతను పర్యవేక్షిస్తామని వివరించారు. 2 వేల మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 2700 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.