TTD SHOULD ROLE MODEL SECURITY FOR FESTIVALS_ TTD EO SINGHAL_ బ్రహ్మూెత్సవాల్లో భక్తులతో స్నేహపూర్వకంగా మెలగాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 22 September 2017: The TTD Executive Officer Sri Anil Kumar Singhal today exhorted the security personnel to emerge as role models in securitising the pilgrim centers by providing hassle free and crime proof services during the Brahmotsavam.

Addressing the members of the TTD Vigilance, Home guards, Scouts and Guides at the Asthana mandapam here along with CVSO Sri Ake Ravikrishna and JEO TML Sri KS Sreenivasa Raju, Sri Singhal said the security forces should be friendly and helping hand to thousands of aged, women, children who come to witness the celestial festival and beget darshan and blessings of Lord Venkateswara.

He said they should strive to enhance the prestige and reputation of TTD and set shining examples in crowd management and smooth passage of the Vahana sevas during the Brahmotsavam for other temple administrations to follow. ‘Every one should strictly adhere to work discipline and report and function at their allocated locations without fail’ he urged them.

JEO Tirumala Sri KS Sreenivas Rao said the security personnel should assist the devotees sitting in the galleries to get satisfactory darshan of Malayappaswamy during the Vahana sevas. They should revise and re-strategise their security plans as per the crowd flow.

Among others who participated in the awareness program were Additional CVSO Sri Shiv Kumar Reddy, VGO Sri Ravindra Reddy and others.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

బ్రహ్మూెత్సవాల్లో భక్తులతో స్నేహపూర్వకంగా మెలగాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సెప్టెంబర్‌ 22, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తులతో స్నేహపూర్వకంగా మెలగాలని, సేవాభావంతో విధులు నిర్వహించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భద్రతా సిబ్బందికి సూచించారు. తిరుమలలోని ఆస్థానమండపంలో శుక్రవారం టిటిడి నిఘా, భద్రత విభాగం, హోంగార్డులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణతో కలిసి ఈవో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ప్రతిష్టను మరింత పెంచేలా బ్రహ్మూెత్సవాల్లో భద్రతా సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. భద్రత విషయంలో మిగతా ఆలయాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. కేటాయించిన ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు.

తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ వాహనసేవల సమయంలో గ్యాలరీల్లోని భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునేలా భద్రతా సిబ్బంది సహకరించాలని సూచించారు. భక్తులతో గౌరవప్రదంగా నడుచుకోవాలన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు భద్రత ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.