ALL SET FOR PANCHAMI THIRTHAM- EO SINGHAL

Tiruchanoor, 7 Dec. 18: TTD Executive Officer Sri Anil Kumar Singhal said that all arrangements were complete for the smooth and successful conduction of Panchami Thirtham on December 12 marking the conclusion of the nine day long Karthika Brahmotsavams at Tiruchanoor.

Speaking to reporters during Kalpavruksha vahanam of Goddess Padmavati, the EO said queue lines; barricades and other engineering works were underway for the Panchami Thirtham event. Temporary toilets and Annaprasada counters were also readied for sake of devotees.

Besides Vahana sevas all devotees are fortunate enough to get Mulamurti darshan of Goddess Padmavati and on Thursday nearly 18,000 devotees had darshan.

He said the devotees were also enthralled by variety of cultural programs, which included Bhakti sangeet and religious discourses on several platforms during the Brahmotsavams. Nearly 10,000 numbers of Tirumala laddu Prasadam was stocked on a daily basis at Tiruchanoor for the convenience of devotees.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

పంచ‌మి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌

డిసెంబరు 07, తిరుప‌తి, 2018: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల చివ‌రిరోజైన‌ డిసెంబ‌రు 12న పంచ‌మితీర్థానికి విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్న‌ట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

తిరుచానూరులో శుక్ర‌వారం జ‌రిగిన క‌ల్ప‌వృక్ష వాహ‌న‌సేవ‌లో ఈవో మీడియాతో మాట్లాడుతూ పంచ‌మితీర్థానికి వ‌చ్చే భ‌క్తుల ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు క్యూలైన్లు, బారీకేడ్లు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. భ‌క్తుల కోసం అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు, తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్న‌ట్టు చెప్పారు. వాహ‌న‌సేవ‌ల‌తో పాటు అమ్మ‌వారి మూల‌మూర్తిని భ‌క్తులు విశేషంగా ద‌ర్శించుకుంటున్నార‌ని, గురువారం 18 వేల మంది భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నార‌ని వివ‌రించారు. వాహ‌న‌సేవ‌ల్లో క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయ‌ని, ప‌లు వేదిక‌ల‌పై ఏర్పాటుచేసిన ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు చ‌క్క‌గా ఉన్నాయ‌ని తెలిపారు. తిరుమ‌ల నుండి రోజుకు 10 వేల చొప్పున శ్రీ‌వారి ల‌డ్డూల‌ను తిరుచానూరులో భ‌క్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచామ‌న్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.