ALL SET FOR SRI VARALAKSHMI VRATAM AT TIRUCHANOOR TEMPLE -TTD JEO _ ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి – టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం
Tirupati,24 August 2023: TTD JEO Sri Veerabrahmam said on Thursday that extensive arrangements rolled out at Sri Padmavati temple in Tiruchanoor for Sri Varalakshmi vratam festivities on Friday.
After reviewing the preparations with officials at Asthana Mandapam, the JEO said the sacred Vratam will be performed on August 25 between 10am and 12noon and festivities in the evening included the procession of Swarna Ratham.
He said as of now 778 grihastas had purchased virtual Seva tickets for the vratam while 500 couples are going to participate live. He urged officials to take all steps keeping past experience in mind for the grand success of the event.
Among others, he directed officials to provide Annarasadam, buttermilk and drinking water, Sindhur packets, Kankanams, bangles packets for all women devotees, properly maintain queue lines, ensure the cleaning, deputations of employees, srivari sevaks and security guards, flower and electrical decorations in the temple, Asthana Mandapam etc. He advised HDPP to deploy bhajan troupes and SVBC to organize a live telecast.
Thereafter the JEO also inspected the arrangements and made valuable suggestions to officials l
SEs Sri Satyanarayana, Sri Venkateswarlu, Temple Dyeo Sri Govindarajan, EEs Sri Manohar, Sri Narasimha Murthy, AEOs Sri Ramesh, DE Electrical Sri Chandrasekhar, Superintendent Smt Srivani, Garden Manager Sri Janardhan Reddy, Temple archaka Sri Babuswamy and other officials were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి
– భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు
టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి, 2023 ఆగస్టు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో గురువారం జేఈవో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఆగస్టు 25వ తేదీ శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు.
500 మంది గృహస్తులు నేరుగా టిక్కెట్లు కొనుగోలు చేసి
ఆస్థాన మండపంలో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 778 మంది గృహస్తులు వర్చువల్ సేవ టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని జేఈవో అధికారులకు సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలని, భజన బృందాలను ఏర్పాటుచేయాలని హిందూ ధర్మప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు.
వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులను సమకూర్చుకోవాలన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
అనంతరం జేఈవో అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఇలు శ్రీ సత్య నారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఇఇలు శ్రీ మనోహర్, శ్రీ నరసింహ మూర్తి, ఏఈవో శ్రీ రమేష్, డిఈ ఎలక్ట్రికల్ శ్రీ చంద్రశేఖర్, ఆదనపు హెల్త్ ఆఫీసర్ డా.సునీల్, గార్డెన్ మేనేజర్ శ్రీ జనార్దన్ రెడ్డి, సూపరిండెంట్ శ్రీమతి శ్రీవాణి, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.