FIRST CITIZEN OF TIRUMALA WAS SRI TIRUMALA NAMBI- ACHARYA CHAKRAVATI RANGANATHAN _ తిరుమల తొలి పౌరుడు శ్రీ తిరుమలనంబి- ఆచార్య చక్రవర్తి రంగనాథన్
1050th AVATAR MAHOTSAVAM OF SRI TIRUMALA NAMBI HELD IN TIRUMALA
Tirumala,24 August 2023: Acharya Chakravarti Ranganathan of National Sanskrit University said on Thursday that Sri Tirumala Nambi was adjudged as the first citizen of Tirumala for performing Nitya Kainkaryas like Pushpa Kakinkaryam, Mantra Pushpa Kakinkaryam, Veda Parayana Kakinkaryam etc.
Presenting his keynote address on the occasion of the 1050th Avatara Mahotsavam of Sri Tirumala Nambi observed at the South Mada street temple of the premiere devotee the Sanskrit scholar said Sri Tirumala Nambi was the maternal uncle of Sri Bhagavad Ramanujacharya and had arrived to Tirumala in 973 AD.
He had taught the basic tenets of Ramayana and laid the foundations of the vishista Advaitha school of thought.
Legends say that Sri Venkateswara had called Sri Tirumala Nambi as is Tata (grandfather) and henceforth the laters descendants were called Tatacharya.
Tirumala Nambi Divya Charitamruta book unveiled
Tirumala Nambi Divya Charitamruta, a compilation on the life and times of Sri Tirumala Nambi drafted by Sri P Venkatramana Reddy in Telugu Translated into English by Sri G Mohan Reddy and Smt Sri Ranjani of Bangalore into Kannada were released on the occasion.
Later 16 pundits presented discourses on lifestyle and contributions of Sri Tirumala Nambi.
Sri Krishna Murti Tatacharya, Alwar Divya Prabhanda project coordinator Sri Purushottam, and other descendants of Tatacharya were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల తొలి పౌరుడు శ్రీ తిరుమలనంబి
– ఆచార్య చక్రవర్తి రంగనాథన్
– వేడుకగా శ్రీ తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవాలు
తిరుమల, 2023 ఆగస్టు 24: తిరుమల శ్రీవారికి పుష్ప కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, ఇతర కైంకర్యాలు చేసి తిరుమల తొలి పౌరుడిగా శ్రీ తిరుమలనంబి నిలిచారని తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ పేర్కొన్నారు. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవం గురువారం తిరుమలలోని శ్రీవారి ఆలయ దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ కీలకోపన్యాసం చేశారు. శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. శ్రీ తిరుమలనంబి స్వయాన శ్రీభగవద్ రామానుజులవారికి మేనమామ అన్నారు. శ్రీమద్ రామానుజాచార్యులకు రామాయణంలోని రహస్యార్థాలను చెప్పి, విశిష్టాద్వైత మతానికి పునాది వేశారని తెలియజేశారు. ఇంతటి పాండిత్యం గల తిరుమలనంబి తన జీవితం మొత్తాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేసి శ్రీవారి చేత తాత అని పిలిపించుకున్నారని, ఈ కారణంగానే వారికి తాతాచార్య వంశీయులుగా పేరు వచ్చిందని వివరించారు.
“తిరుమలనంబి దివ్యచరితామృతం” పుస్తకావిష్కరణ
ఈ సందర్భంగా తిరుమలనంబికి సంబంధించిన విశేష అంశాలతో రచించిన తిరుమలనంబి దివ్యచరితామృతం పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజయవాడకు చెందిన శ్రీ పాలకొలను వెంకటరామిరెడ్డి ఈ పుస్తకాన్ని తెలుగులో రచించారు. దీన్ని గిద్దలూరుకు చెందిన శ్రీ గంటా మోహన్ రెడ్డి ఇంగ్లీషులోకి, బెంగళూరుకు చెందిన శ్రీ రంజని కన్నడ భాషలోకి అనువదించారు.
అనంతరం శ్రీ తిరుమలనంబి జీవితవిశేషాలపై 16 మంది పండితులు కూలంకషంగా ఉపన్యసించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ తిరుమలనంబి వంశీకులు శ్రీ కృష్ణమూర్తి తాతాచార్యులు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, తాతాచార్య వంశీయులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.